NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సురేంద్ర నాయుడు కుటుంబానికి మంత్రి నారా లోకేష్ భరోసా..!!

1 min read

ఆలూరు న్యూస్ నేడు:  ఆస్పరి టిడిపి యువ నాయకుడు వాల్మీకి ఓబులేష్ నాయుడు సురేంద్ర కుటుంబాన్ని ఆదుకోవాలని, ఉండవల్లి నివాసంలో  రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేష్ ను కలిసి తమ సమస్యలు వివరించారు. ఈ సందర్భంగా వాల్మీకి ఓబులేష్ నాయుడు మాట్లాడుతూ, నా అన్న తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం కృషి చేశాడు. ప్రజల్లో సామాజిక సేవా కార్యక్రమాలు కూడా చేపట్టారని తెలిపారు. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకల్లో మా అన్న జిల్లా తెలుగు యువత అధికార ప్రతినిధి వాల్మీకి సురేంద్ర నాయుడు గుండెపోటుతో మరణించడం జరిగింది. ఉండవల్లి నివాసంలో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్  ని కలిసి  కుటుంబానికి న్యాయం చేసి, టీడీపీ పార్టీలో ( నామినేటెడ్ పదవి ) తగిన స్థానం కల్పించి అన్ని విధాలుగా ఆదుకోవాలని విన్నవించినట్లు యువ నాయకుడు వాల్మీకి ఓబులేష్ నాయుడు గురువారం విలేకరుల సమావేశంలో  తెలిపారు. రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేష్  మీ కుటుంబాన్ని ఆదుకుంటామని, తప్పకుండ న్యాయం చేస్తానాని హామీ ఇచ్చినట్లు తెలిపారు అలాగే త్వరలో సురేంద్ర నాయుడు కుటుంబాన్ని పిలిపించి మాట్లాడుతానని అన్ని విధాలుగా సాయం చేస్తామని హామీ ఇచ్చారు . ఈ కార్యక్రమంలో ఆస్పరి మండలం తెలుగు యువత అధికార ప్రతినిధి ఓబులేష్ నాయుడు, పాల్గొన్నారు.

About Author