పదవ తరగతి పరీక్షా కేంద్రాలను పరిశీలించిన జిల్లా పరీక్షల ఉప కమిషనర్
1 min read
పత్తికొండ, న్యూస్ నేడు: పత్తికొండ మండలంలోని పదవ తరగతి పరీక్ష కేంద్రాలను జిల్లా పరీక్షల ఉప కమిషనర్ గోవింద నాయక్ గురువారం సందర్శించి పరిశీలించారు. స్థానిక సెయింట్ జోసెఫ్ స్కూల్, యశోద గార్డెన్, ఏపీ మోడల్ స్కూల్, గవర్నమెంట్ హై స్కూల్, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గురుకులం, జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల సెంటర్లలో పదవ తరగతి పరీక్షల నిర్వహణకు అవసరమయ్యే సదుపాయాలను సమీక్షించారు. అలాగే మోడల్ స్కూల్, జిల్లా పరిషత్ గర్ల్స్ హై స్కూల్, గవర్నమెంట్ హై స్కూల్ లో పదవ తరగతి బోధించే ఉపాధ్యాయులతో ఈ సందర్భంగా సమావేశం నిర్వహించారు. విద్యార్థుల ఫలితాల మెరుగుదలకు ప్రతి ఉపాధ్యాయుడు కృషి చేయాలని ఆయన ఉపాధ్యాయులకు సూచించారు.పిల్లల్లో ఉన్న ఇతర అలవాట్లను వదిలించుకుని పూర్తిగా పరీక్షలపై దృష్టి పెట్టేలా వారికి మార్గదర్శనం ఇవ్వాలని, కనీసం 90 శాతం పాస్ పర్సంటేజ్ సాధించేలా శ్రమించాలన్నారు.ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి రమేష్ , ఎగ్జామినేషన్ సీనియర్ అసిస్టెంట్ పిఎంఎస్ ఖాన్ , సీఆర్పీ తులసిధర్ రెడ్డి పాల్గొన్నారు.


