NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

శ్రీ షిరిడి సాయి ప్రేమ మందిర్ లో స్వాములకు పెద్ద ఎత్తున అన్న ప్రసాద వితరణ

1 min read

అన్న ప్రసాద దాతలు డాక్టర్:బల్థా

విజయ ప్రసాద్,లావణ్య దంపతులు

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: శ్రీ షిరిడి సాయి ప్రేమ మందిర్ ఆదివారపు పేట లో మంగళవారం తృతీయ స్వాముల భిక్ష  కార్యక్రమం ఆలయ కమిటీ నిర్వహకులు పెద్ద ఎత్తున ఘనంగా నిర్వహించారు. అన్న ప్రసాద వితరణ దాతలు డాక్టర్:బల్థా విజయ ప్రసాద్, డాక్టర్:లావణ్య (న్యూరో సర్జన్స్)  దంపతులు ఏర్పాటు చేశారు. గత సంవత్సరాలుగా ఈ దంపతులు స్వాములకు అన్న ప్రసాద వితరణను పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నారు. ఇటువంటి కార్యక్రమాలకు మంచి మనసుతో సేవా దృక్పథంతో ప్రోత్సాహం అందిస్తున్న డాక్టర్:విజయప్రసాద్ లావణ్య దంపతులను స్వాములు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని నమస్కరించారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందించి శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఆశీర్వదించారు. అనంతరం శ్రీ శిరిడి సాయి ప్రేమ మందిర్ ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు ఇసుకపల్లి తాతారావు (ఐటిఆర్) మరియు పర్యవేక్షక సంఘ సభ్యులు, భక్త బృందం దంపతులను శాలువా కప్పి సాయిబాబా చిత్రపటాన్ని అందించి ఘనంగా సత్కరించారు.

About Author