NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

విద్యార్థులకు మాదకద్రవ్యాల పై అవగాహన

1 min read

పెదవేగి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకులంలో ఈగల్ టీం  కార్యక్రమం

అనుమానస్పద సమాచారం ఉంటే వెంటనే ఈగల్ టోల్ ఫ్రీ నెంబర్ 1972 కి కాల్ చేయాలి

పెదవేగి ఎస్.ఐ పి.రామకృష్ణ, ఈగల్ ఆర్ఎస్ఐ బి.ఉదయ భాస్కర్

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఏలూరు ఎస్పీ కె.ప్రతాప్ శివ కిషోర్ ఐపీఎస్ ఆదేశాల మేరకు, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల.పెదవేగి నందు ఈగల్ డిపార్ట్మెంట్  ఆధ్వర్యంలో విద్యార్థులకు మాదకద్రవ్యాల అవగాహన కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు మత్తు పదార్థాల వలన కలిగే శారీరక, మానసిక దుష్ప్రభావాలు, అలాగే ఎన్​డిపిఎస్​ చట్టం ప్రకారం ఉండే చట్టపరమైన శిక్షలు గురించి క్లుప్తంగా విద్యార్థులకు క్షుణ్ణంగా వివరిస్తూ అవగాహన కల్పించారు.కార్యక్రమంలోని ముఖ్యాంశాలు గంజాయి, గుట్కా, సిగరెట్లు, ఈ-సిగరెట్లు వంటి మత్తు పదార్థాల వల్ల కలిగే దీర్ఘకాలిక ఆరోగ్యపరమైన ప్రమాదాలపై అవగాహన కల్పించడమైనది.చెడు స్నేహితుల ప్రభావం, సామాజిక ఒత్తిళ్లు డ్రగ్స్‌ వైపు తీసుకెళ్లే విధానంపై విద్యార్థులకు మార్గదర్శనం ఇవ్వడం జరిగింది.మాదక ద్రవ్యాల వినియోగం విద్య, భవిష్యత్ కెరీర్ మరియు కుటుంబంపై కలిగించే ప్రతికూల ప్రభావాలను వివరించడం జరిగింది. ఎన్​డిపిఎస్​ చట్టం ప్రకారం అక్రమ రవాణా, నిల్వ, వినియోగంపై విధించే శిక్షలను విద్యార్థులకు తెలియజేయడం జరిగినదని తెలిపారు.డ్రగ్స్‌కు “నో టు డ్రగ్స్” ప్రతిజ్ఞ చేయించడమే కాకుండా విద్యార్థులతో ప్రత్యేక ఇంటరాక్షన్ సెషన్ నిర్వహించి సందేహాలు నివృత్తి చేయడం జరిగింది.పాఠశాల మరియు పరిసర ప్రాంతాల్లో డ్రగ్స్‌పై అప్రమత్తంగా ఉండాలని, ఏ అనుమానాస్పద సమాచారం ఉంటే వెంటనే ఈగల్ టోల్ ఫ్రీ నెంబర్ 1972 కి  తెలియజేయాలని సూచించడమైనది.కార్యక్రమంలో పెదవేగి పిఎస్ ఎస్సై రామకృష్ణ,ఈగల్ డిపార్ట్మెంట్ ఆర్ఎస్ఐ బి. ఉదయ భాస్కర్, హెచ్ సి  బి.సూర్యచక్ర తదితర సిబ్బంది పాల్గొన్నారు.

About Author