NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

టెట్ సమస్యను ఆపస్  పరిష్కరించి తీరుతుంది..

1 min read

విజయవాడ, న్యూస్​ నేడు:  ,2011 ముందు ఉపాధ్యాయుల నియామకమై సర్వీసులో ఉన్న వారందరూ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) తప్పనిసరిగా ఉత్తీర్ణులు అవ్వాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు రాష్ట్ర ప్రభుత్వం కూడా టెట్ నోటిఫికేషన్ ఇవ్వడంతో ఉపాధ్యాయులు అందరూ ఆందోళనలో ఉన్నారని, ఏం సర్వీస్ టీచర్లకు పెట్టనుండి మినహాయింపు ఇప్పించాలని రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మరియు వైద్య శాఖ మాత్యులు శ్రీ సత్య కుమార్ యాదవ్ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం (ఆపస్) పక్షాన వినతి పత్రం ఇవ్వడం జరిగిందని, అందుకు అనుగుణంగా మంత్రివర్యులు సత్వరమే స్పందించి కేంద్ర విద్యా శాఖ మాత్యులు శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ కి లేఖ ద్వారా కోరడం, కేంద్ర మంత్రిత్వ చర్చించడం జరిగిందని, త్వరలోనే ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ మినహాయింపు పై కేంద్రం నుండి సానుకూలంగా అధికారిక ప్రకటన విడుదల అయ్యే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు సమన్న బాలాజీ ప్రధాన కార్యదర్శి జి వి సత్యనారాయణ ఓ ప్రకటనలో తెలిపారు.ఆపస్ ఇచ్చిన ఇచ్చిన వినతి పై సత్వరమే స్పందించి టెట్ సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తున్న రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీ వై సత్య కుమార్  ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం పక్షాన, రాష్ట్రంలోని ఉపాధ్యాయుల పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని వారు తెలిపారు.

About Author