మహానంది ఆలయానికి భద్రత కరువు..
1 min read

మహానంది, న్యూస్ నేడు: రాష్ట్రంలో ప్రముఖ శైవ క్షేత్రమైన మహానంది ఆలయానికి భద్రత కరువైంది. ప్రతినిత్యం విఐపి లు వీఐపీల తాకిడి మహానంది క్షేత్రములో ఉంటుంది. మరోవైపు పలు పర్వదినాల్లో భక్తుల సంఖ్య విపరీతంగా ఉండడంతో పాటు క్షేత్రంలోని ప్రధాన కోనేరుల యందు పుణ్యస్నానాలు ఆచరించే వారి సంఖ్య కూడా అధికంగానే ఉంటుంది. కానీ విఐపి లకు వీవీఐపీలకు ప్రత్యేక భద్రత ఏర్పాటు చేస్తున్న సామాన్య భక్తులకు మాత్రం భద్రత గాలిలో దీపంగా మారిందనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. ప్రస్తుతం మహానంది క్షేత్రంలో 3 షిఫ్టుల్లో ముగ్గురు హోంగార్డులు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. గతంలో 8 నుండి 9 మంది హోంగార్డులు వివిధ షిఫ్టుల్లో పనిచేసేవారు. ఉదయం4, మధ్యాహ్నం3, రాత్రి షిఫ్టుల్లో ఒకరు లేదా ఇద్దరు విధులు నిర్వహించేవారు. కానీ భద్రతా కారణాలను పక్కనపెట్టి గతంలో క్షేత్రానికి భారంగా మారుతున్నారని హోంగార్డుల సంఖ్య తగ్గించారని ఆరోపణలు వస్తున్నాయి. వీటికి తోడు పోలీస్ ఉన్నత అధికారులు కూడా సరిపడ హోంగార్డుల సంఖ్య తక్కువగా ఉందని కారణం చేత మీన వేషాలు వేస్తూ కాలం వెలదీస్తున్నట్లు సమాచారం. మహానంది ఆలయ అధికారులు ఆలయ భద్రత కోసం హోంగార్డుల సంఖ్య పెంచాలని పలుసార్లు విన్నవించిన జిల్లా పోలీస్ యంత్రాంగం స్పందించడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. ప్రస్తుతం ఒక్కొక్క షిఫ్టులో ఒక్కొక్క హోంగార్డును మాత్రమే నియమించడం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో లేదా దేశంలో ఏదో ప్రాంతంలో ఉగ్ర కార్యకలాపాలు జరిగినప్పుడు మాత్రమే హడావిడి చేసే అధికారులు అనంతరం పట్టించుకోవడంలేదని విమర్శలు వినవస్తున్నాయి.

