కమ్మ సంఘం ఆధ్వర్యంలో అన్నవితరణ
1 min read

మహానంది, న్యూస్ నేడు: కార్తీక మాసం చివరి సోమవారం సందర్బంగా కమ్మ సంఘం అడ్వర్రయంలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.మహానంది మండలంలోని బుక్కాపురం గ్రామానికి చెందిన మహానంది మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కంచర్ల శివశంకర్ చౌదరి, గడ్డం నాగపుల్లయ్య,వేమూరి కేశాలు ల ఆధ్వర్యంలో సదానంద ఆశ్రమం వద్ద ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేశారు. ముందుగా సదానంద ఆశ్రమంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీక చివరి మాసం కావడంతో నంద్యాల నుండి మహానంది పుణ్యక్షేత్రానికి వెళ్లే భక్తులు, కాలినడకన వెళ్ళే వందలాదిమంది భక్తులు ఇక్కడ అన్న వితరణచేసి తమ ఆకలి తీర్చుకున్నారు.ఈ కార్యక్రమంలో కమ్మసంగం నాయకులు అడ్వకేట్ కంచర్ల సత్యనారాయణ, ఉప సర్పంచ్ పోక ఉసేని,మాజీ సర్పంచ్ గడ్డం హరిప్రసాద్, నరసయ్య, నల్లపాటి శంకర్, ఆదినారాయణ, పోక కిట్టు,సాంబమూర్తి, సత్యనారాయణ,తదితరులు పాల్గొన్నారు.

