మద్దతు ధర కోసం హోరెత్తిన దీక్షలు..
1 min read

డాక్టర్ సుధీర్ ఆధ్వర్యంలో విజయవంతం
హాజరైన కాటసాని,ఎమ్మెల్సీ..బుడ్డా శేషారెడ్డి
నందికొట్కూర్ లో వైసీపీ,సీపీఎం రిలే నిరాహార దీక్ష..
నందికొట్కూరు, న్యూస్ నేడు: రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని నందికొట్కూరు వైసీపీ ఇన్చార్జి డాక్టర్ ధారా సుధీర్ అన్నారు.సోమవారంపంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని అదేవిధంగా మొక్కజొన్నలను కొనుగోలు చేయాలని కోరుతూ నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణం పటేల్ సెంటర్ లో డాక్టర్ సుధీర్ ఆధ్వర్యంలో మరియు పొట్టి శ్రీరాములు విగ్రహం ఎదుట సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలతో పట్టణంలో హోరెత్తాయి.ఈ దీక్షలు విజయవంతం అయ్యాయి. దీక్షలకు సిపిఐ మరియు సిపిఐ ఎంఎల్ మద్దతు తెలిపాయి.ఏర్పాటు చేసిన టెంట్ల దగ్గర డాక్టర్ సుధీర్ తో పాటు ప్రజా ప్రతినిధులు ఆకుపచ్చని కండువాలు,పూలమాలలు ధరించి సాయంత్రం వరకు దీక్షలను చేపట్టారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొక్కజొన్నల కొనుగోలులో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని అన్నారు.సీపీఐ నాయకులు రఘురాంమూర్తి,శ్రీనివాసులు మద్దతు తెలిపారు.2004 లో రైతులకు ఇచ్చిన మద్దతు ధర ఇప్పుడు అదేవిధంగా ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.ఈ ప్రభుత్వానికి ప్రైవేటీకరణపై ఉన్న శ్రద్ధ రైతుల పట్ల లేదన్నారు.రైతు సంఘం జిల్లా అధ్యక్షులు రాజశేఖర్,కార్యవర్గ సభ్యులు నాగేశ్వరరావు మాట్లాడుతూ గత నెల రోజుల నుండి ఉద్యమాలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వారు విమర్శించారు. మధ్యాహ్నం వైసిపి నంద్యాల జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్ రెడ్డి,ఎమ్మెల్సీ ఇసాక్ బాష,ఆత్మకూరు బుడ్డా శేషారెడ్డి దీక్షకు హాజరై మాట్లాడారు.పంటలకు పెట్టుబడి పెట్టిన ఖర్చులు రాలేని పరిస్థితి ఏర్పడిందని కాటసాని రాంభూపాల్ రెడ్డి అన్నారు.తర్వాత ప్రజా ప్రతినిధులు నాయకులు ప్రసంగించారు.ఈ కార్యక్రమంలో జడ్పిటిసిలు పర్వత యుగంధర్ రెడ్డి,జగదీశ్వర్ రెడ్డి,కలీమున్నిసా,పట్టణ అధ్యక్షులు మన్సూర్, జబ్బార్,వైయస్సార్ టియుసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోమిన్ మన్సూర్,సిపిఐ ఎంఎల్ వెంకటేశ్వర్లు, మండలాల కన్వీనర్లు, ఎంపీటీసీలు,సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.


