NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

చౌట్కూరు రాజకుమారికి బంగారు పతకం..

1 min read

రాష్ట్రస్థాయి తైక్వాండో’లో మొదటి విజేత..

మిడుతూరు (నందికొట్కూరు) న్యూస్ నేడు :   రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీల్లో రాజ కుమారి మొదటి విజేతగా నిలిచి బంగారు పతకం సాధించారు.నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని చౌటుకూరు గ్రామానికి చెందిన ఈడిగ రమణమ్మ మరియు కీ.శే. జగన్నాథ గౌడ్ కుమార్తె ఈ. రాజ కుమారి(22) పోటీల్లో ఉన్నత ప్రతిభ కనబరిచారు.కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు ఈనెల 15,16వ తేదీల్లో కాకినాడలో సూర్యకళ మందిరంలో జరిగిన రాష్ట్రస్థాయి 38వ సబ్ జూనియర్,8వ క్యాడేట్ 14 వ సీనియర్ తైక్వాండో చాంపియన్ షిప్ ఆటల పోటీల్లో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో మొదటి స్థానంలో నిలిచినట్లు వారు తెలిపారు. కాకినాడ జిల్లా స్పోర్ట్స్ అభివృద్ధి అధికారి వి సతీష్ కుమార్ మరియు అధికారులు రాజకుమార్ కి బంగారు పథకాన్ని అందజేసి సన్మానించారు.నాకు శిక్షణ ఇచ్చిన సంజీవరెడ్డి,వెంకటేష్ లకు రాజకుమారి కృతజ్ఞతలు తెలిపారు అదేవిధంగా నాకు పోటీల్లో పాల్గొనడానికి మా అమ్మ ఎంతగానో ప్రోత్సహించారని అమ్మాయి తెలిపారు.అమ్మాయి బంగారు పతకం సాధించడం పట్ల కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

About Author