NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రభుత్వ స్థలాన్ని కాపాడండి:  సిపిఎం 

1 min read

పత్తికొండ, న్యూస్​ నేడు:   కబ్జాదారుల నుంచి ప్రభుత్వ భూమిని కాపాడాలని సిపిఎం  ఆధ్వర్యంలో సోమవారం స్పందన కార్యక్రమంలో ఆర్డీవో భరత్ నాయక్ కు వినతిపత్రం సమర్పించారు. పెద్దహుల్తి గ్రామ  సిపిఎం పత్తికొండ మండల కమిటీ సభ్యులు సురేంద్ర, పెద్దహుల్తి సిపిఎం గ్రామ కమిటీ సభ్యులు బ్రహ్మయ్య రాముడు ఈ సందర్భంగా మాట్లాడుతూ, జూటూరు రెవెన్యూ పరిధిలోని 130/2 సర్వే నెంబర్ లో  గ్రామానికి చెందిన నిరుపేదలకు గత ప్రభుత్వంలో జగనన్న కాలనీల పేరుతో ఇంటి స్థలాలు మంజూరయ్యాయని, మిగిలి ఉన్న కొంత భూమిని ప్రభుత్వం ఆ కాలనీల అభివృద్ధి కమ్యూనిటీ పర్పస్ కోసం కేటాయించిన భూమిని అప్పుడున్న ప్రభుత్వ అధికారులు ఇతరులకు పట్టాలు ఇవ్వడానికి ప్రయత్నం చేశారని తెలిపారు. కానీ నేడు ఆ ప్రభుత్వ భూమిని కొందరు కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. విలువైనటువంటి ప్రభుత్వ భూమిని కొందరు కబ్జా చేయాలని చూస్తున్న అధికారులు చేయాలని ప్రయత్నిస్తున్న అధికారులు ఏమాత్రం పట్టించుకోవడంలేదని వారు పేర్కొన్నారు. అలాగే కొందరు ప్రభుత్వ అధికారులు సైతం అలాంటి వ్యక్తులకి సహకరిస్తూ ప్రభుత్వ భూములను కబ్జాదారులకు కట్టబెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ప్రభుత్వ స్థలాల్లో కొంతమందికి పట్టాలు మంజూరు చేసినట్టు ఇప్పటికే కొంతమంది దగ్గర పట్టాలు ఉన్నట్టు ప్రచారం జరుగుతున్న సందర్భంగా అలాంటి పట్టాలపై ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకోవాలని అలాగే ఆ పట్టాలు ఎక్కడి నుండి వచ్చాయో అలాంటి అధికారులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో సిపిఎం పార్టీగా గ్రామంలో ఉన్న పేద ప్రజలను కలుపుకొని పోరాటానికి పిలుపునిస్తామని వారు హెచ్చరించారు.

About Author