NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సతీష్ కుమార్ మరణం పై పూర్తిస్థాయి విచారణ చేపట్టండి..

1 min read

ఆయన కుటుంబానికి తక్షణ సాయం అందించాలి                                               

 కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి క్రాంతి నాయుడు డిమాండ్ 

పత్తికొండ , న్యూస్​ నేడు: పత్తికొండ కు చెందిన బలహీన వర్గాల నుండి ఒక నిజాయితీ ఆఫీసర్గా టీటీడీ ఏవిఎస్ఓగా విధులు నిర్వహించిన సతీష్ కుమార్ దారుణంగా హత్యకు గురయ్యారని, ఈ హత్య వెనుక ఎవరున్నారనే దానిపై పూర్తిస్థాయి విచారణ చేసి, తక్షణమే ఆయన కుటుంబానికి ఆర్థిక సాయం అందించాలని పత్తికొండ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి క్రాంతి నాయుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం          పత్తికొండ లోని స్థానిక ఆర్డీఓ కార్యాలయం లో రెండు ముఖ్య ప్రజా అంశాలపై ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తూ, ఆయన ఆర్డీఓ భరత్ నాయక్ కు వినతి పత్రం సమర్పించారు. మాజీ టీటీడీ ఏవీఎస్వో సతీష్ కుమార్ అనుమానాస్పద మరణంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, వారి కుటుంబానికి ₹1 కోటి రూపాయల ఎక్స్‌గ్రేషియా, 5 ఎకరాల భూమి, కుటుంబ సభ్యునికి గ్రూప్ 2 స్థాయి ప్రభుత్వ ఉద్యోగం, మరియు నిష్పక్షపాత దర్యాప్తు జరగాలని డిమాండ్ చేశారు. నిజాయితీ గల అధికారుల భద్రతను కాపాడే బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు.అదేవిధంగా, 1962లో స్థాపించబడిన పత్తికొండ జెడ్పీ గర్ల్స్ హైస్కూల్‌కు శాశ్వతమైన ఆటస్థలం, యాక్టివిటీ స్పేస్ లేకపోవడం విద్యార్థినుల శారీరక మరియు మానసిక అభివృద్ధికి అడ్డంకిగా మారుతోందని పేర్కొంటూ, పత్తికొండ లో అందుబాటులో సరైన ప్రభుత్వ భూమిని కేటాయించడం లేదా అవసరమైతే టీటీడీ సహకారంతో టీటీడీ కళ్యాణమండపం మరియు అక్కడ ఉన్న ఖాళీ స్థలం కేటాయించాలి అని కోరారు. మహిళలు కప్ గెలిస్తే సంబరాలు చేసుకోవడం కాదు అదే మహిళలకు ప్రోత్సాహం, గ్రామీణ బాలికలకు సమాన క్రీడా అవకాశాలు అందించడంలో ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

About Author