ఆసుపత్రి ఆవరణలో పార్కింగ్ పనులపై సూపరింటెండెంట్ పరిశీలన
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల ఆవరణలో కొనసాగుతున్న పార్కింగ్ అభివృద్ధి పనులను ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కే. వెంకటేశ్వర్లు పరిశీలించారు.సూపర్ స్పెషాలిటీ ఓపి బ్లాక్, న్యూ డయాగ్నస్టిక్ బ్లాక్, ఫిమేల్ మెడికల్ వార్డు, ఆర్ట్ సెంటర్ పరిసరాల్లో జరుగుతున్న పార్కింగ్ పనుల పురోగతిని ఆరా తీశారు. తరువాత ఇంజినీరింగ్ విభాగాధికారులతో కలిసి పర్యవేక్షణ సమావేశం నిర్వహించారు. పార్కింగ్ పనులను వేగవంతం చేయాలని ఇంజనీర్లను ఆదేశించినట్లు తెలిపారు.ఆసుపత్రికి వచ్చే రోగుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో పార్కింగ్ వ్యవస్థను మెరుగుపరచడం అత్యవసరం అని ఆయన అన్నారు.అవసరమైన చోట తాత్కాలిక పార్కింగ్ సౌకర్యాలు కూడా కల్పించేందుకు సెక్యూరిటీ సిబ్బందికి ఆదేశించారు.

