అన్నదాతకు రాష్ట్ర ప్రభుత్వం అండ…
1 min read

అన్నదాత సుఖీభవ పథకం కింద జిల్లాలో అర్హులైన 2,72,757 రైతులకు రూ.181.51 కోట్లు లబ్ది
జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి
కర్నూలు, న్యూస్ నేడు: అన్నదాతకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తోందని, రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో అన్నదాత సుఖీభవ-పిఎం కిసాన్ పథకం కింద జిల్లాలో అర్హులైన 2,72,757 రైతులకు రూ.181.51 కోట్లు లబ్ది కలిగిందని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి పేర్కొన్నారు.బుధవారం కోడుమూరు నియోజకవర్గం ఆర్. కొంతలపాడు లో అన్నదాత సుఖీభవ – పిఎం కిసాన్ 2025- 26 రెండవ విడత నిధుల విడుదల కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, కోడుమూరు ఎమ్మెల్యే పాల్గొన్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గత సంవత్సరం ఉల్లి పంటకి మంచి ధర పలికిందని చెప్పి, రైతులు ఈసారి ఎక్కువ మోతాదులో ఉల్లి పంటను వేయడం జరిగిందన్నారు… ఉల్లి పంట వేసేటప్పుడు సైంటిఫిక్ గా టెస్ట్ చేసి ప్రూవ్ అయిన మంచి విత్తనాల్ని వాడాలన్నారు.. అటువంటి విత్తనాలు వాడకుండా లోకల్ గా పెంచే వెరైటీస్ విత్తనాలను వాడారని అంతే కాకుండా ఈ సంవత్సరం అకాల వర్షాలు రావడం వల్ల ఉల్లి పంట దెబ్బ తిందన్నారు… ఎత్తు మడులు వేసి అందులో ఉల్లి పంట నాటి ఉంటే వర్షం పడినా కూడా పంట నాశనం అయి ఉండేది కాదన్నారు.. మంగళవారం సీసీఐ వారు కూడా కాటన్ మిల్స్ లో పత్తి తేమ శాతం 14 ఉన్నపటికీ కూడా రైతుల్ని వెనక్కి పంపించకుండా తీసుకుంటున్నారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి మేనిఫెస్టోలో ప్రవేశపెట్టినటువంటి సూపర్ సిక్స్ పథకాలలో ప్రతి ఒక్కటిని అమలు చేస్తూ తన యొక్క మాట నిలబెట్టుకున్నారన్నారు. అన్నదాత సుఖీభవ, స్త్రీ శక్తి, దీపం – 2 పథకం, మెగా డీఎస్సీ ఇలా ప్రతి ఒక్క పథకం చెప్పింది చెప్పినట్లుగా అమలు చేశారన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి వరలక్ష్మి, ఉద్యాన శాఖ అధికారి రాజాకృష్ణ రెడ్డి, ఎల్ డి ఎం రామచంద్ర రావు, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ సాలు రెడ్డి, కర్నూలు రూరల్ తహసిల్దార్ రమేష్, గ్రామ సర్పంచ్ మహానంది, బి.తాండ్రపాడు సర్పంచ్ జయన్న, తదితరులు పాల్గొన్నారు.


