NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పరిశ్రమల స్థాపనకు వీలుగా నిర్దేశించిన గడువు లోపు అనుమతులు మంజూరు చేయాలి

1 min read

జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి

కర్నూలు, న్యూస్​ నేడు : పరిశ్రమల స్థాపనకు వీలుగా ఆయా శాఖలు నిర్దేశించిన గడువు లోపు అనుమతులు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్ లో డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కమిటీ  సమావేశాన్ని జిల్లా కలెక్టర్  నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… సింగిల్  డెస్క్ పోర్టల్ ద్వారా  వచ్చిన దరఖాస్తులకు గడువు లోపు  అనుమతులను  మంజూరు చేయాలని, పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి త్వరితగతిన అనుమతులు మంజూరు చేయాలని  కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగా పెట్టుబడి రాయితీ క్రింద ఒక క్లెయిమ్ కు   రూ. 5,29,398/- లు, పవర్ కాస్ట్ రీయంబర్స్మెంట్ కింద ఒక  క్లెయిమ్ కు  రూ. 66,257/- లు, సేల్స్ ట్యాక్స్ రీయంబర్స్మెంట్ కింద ఒక  క్లెయిమ్ కు రూ. 3,77,186/- లు, పారిశ్రామిక ప్రోత్సాహకాల కింద ఆమోదం తెలపడం జరిగిందని కలెక్టర్ తెలిపారు.సమావేశంలో పరిశ్రమల శాఖ జిఎం అశోక్ కుమార్, పరిశ్రమల శాఖ డిడి జవహర్ బాబు, మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ, నాబార్డ్ డిడిఏం సుబ్బారెడ్డి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్  ఈఈ కిషోర్ కుమార్ రెడ్డి, ఎల్డీఎం రామచంద్రారావు, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ మధుసూదన్ రెడ్డి, డిపిఓ భాస్కర్ ,జెడి అగ్రికల్చర్ వరలక్ష్మి , ఏడి హార్టికల్చర్ రాజా కృష్ణారెడ్డి,   ఎస్సీ ఎస్టీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ రాజామహేంద్రనాథ్, ఐలా చైర్మన్ రామకృష్ణా రెడ్డి , ఇతర శాఖల జిల్లా అధికారులు  పాల్గొన్నారు.

About Author