NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పనితీరు మెరుగుపరుచుకోండి…

1 min read

నగరపాలక అదనపు కమిషనర్ ఆర్‌జివి క్రిష్ణ

పారిశుద్ధ్య పర్యవేక్షక సిబ్బందితో సమావేశం

ప్రజా ఫిర్యాదులపై వెంటనే స్పందించాలి

ట్రేడ్ లైసెన్స్ వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలి

కర్నూలు, న్యూస్​ నేడు:  గురువారం పారిశుద్ధ్య సిబ్బంది తమ పనితీరు మెరుగుపరుచుకోవాలని, లేనిపక్షంలో చర్యలు తప్పవని అదనపు కమిషనర్ ఆర్‌జి‌వి కృష్ణ హెచ్చరించారు. గురువారం స్థానిక ఎస్బిఐ ఎంప్లాయిస్ కాలనీలోని నగరపాలక సమావేశ భవనంలో శానిటేషన్ ఇన్‌స్పెక్టర్లు, కార్యదర్శులతో అదనపు కమిషనర్, డిప్యూటీ కమిషనర్ సతీష్ కుమార్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ మాట్లాడుతూ.. పురమిత్ర, పీజీఅర్ఎస్, పత్రికల్లో వచ్చే కథనాలపై తక్షణమే స్పందించాలను ఆదేశించారు. సామూహిక మరుగుదొడ్ల శుభ్రత రోజువారీగా జరిగేలా చూడాలని, డోర్ టూ డోర్ తడి–పొడి చెత్త సేకరణలో ఎవ్వరూ నిర్లక్ష్యం చేయరాదని స్పష్టం చేశారు. నగర పారిశుద్ధ్య పనులు కొన్ని ప్రాంతాల్లో ఆధ్వాన స్థితికి చేరుతున్నాయని అసహనం చేశారు. కొంతమంది కార్యదర్శులు కార్మికుల మొబైల్ ఆధారిత హాజరును ఎందుకు నమోదు చేయడం లేదని ప్రశ్నించారు. బ్లాక్ స్పాట్ ప్రాంతాల శుభ్రతకు తీసుకునే సమయంపై స్పష్టత ఇవ్వాలని కోరారు. సచివాలయ పరిధిలోని దుకాణాల సంఖ్యపై అవగాహన లేకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. డెంగీ కేసులు ఎక్కువైన ప్రాంతాల్లో పరిశుభ్రత పనులు చేపట్టకపోవడం బాధ్యత అవసరమన్నారు. ట్రేడ్ లైసెన్స్ వసూళ్లను ఆలస్యం చేయకుండా పూర్తి చేయాలని, సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై తనిఖీలు, జరిమానాలు తప్పనిసరిగా విధించాలని ఆదేశించారు.డిప్యూటీ కమిషనర్ సతీష్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. పూడిక తీత పనులు నిరంతరంగా కొనసాగాల్సిన అవసరం ఉందన్నారు. ఎంహెచ్‌ఓ నాగశివ ప్రసాద్ మాట్లాడుతూ.. విధుల పట్ల ప్రతి విభాగం బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. కమిషనర్  పలుమార్లు ఇచ్చిన సూచనలను పాటించకపోవడం విచారకరమన్నారు. ప్రధాన రహదారులు, పాఠశాలలు, మార్కెట్లు, ప్రార్థనా మందిరాల వద్ద పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. మొండి ట్రేడ్ లైసెన్స్ వసూళ్లపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని సూచించారు.

About Author