పది పరీక్ష కేంద్రాల పరిశీలన…
1 min read

ప్యాపిలి న్యూస్ నేడు : ప్యాపిలి మండలంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల, బాలికలు ఉన్నత పాఠశాల మరియు మండలంలోని పదవ తరగతి పరీక్ష కేంద్రాలను డోన్ ఉప విద్యాధికారి మరియు జిల్లా అసిస్టెంట్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ అధికారి రఘురాం రెడ్డి పరిశీలించారు. వచ్చే సంవత్సరం – 2026 మార్చిలో జరగనున్న పదవ తరగతి పరీక్షల కోసం పాఠశాలలో వసతులు సౌకర్యాలపై పాఠశాల ప్రధానోపాధ్యాయులతో ఆరా తీశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 100శాతం ఉత్తీర్ణత సాధించేలా 100 రోజుల ప్రణాళిక డిసెంబర్ నెలలో ప్రారంభమవుతుంది అని ,అలాగే డిసెంబర్ 05 లోపు సిలబస్ పూర్తి చేసి రివిజన్ టెస్ట్లకు విద్యార్థులను సన్నదం చేయాలని తెలిపారు. విద్యార్థులతో మాట్లాడుతూ పదవ తరగతి విద్యార్థులు చాలా కీలకమైనదని బాగా చదువుకొని తల్లిదండ్రులకు, పాఠశాలకు, ఉపాధ్యాయులకు మరియు పుట్టిన ఊరికి మంచి పేరు తేవాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారులు వెంకటేశ్వర నాయక్ మరియు మహేశ్వర్ రెడ్డి సిఆర్పి రామాంజనేయులు పాల్గొన్నారు.


