రోగాల నివారణకు పరిశుభ్రత ముఖ్యం..
1 min read

ఎంపీడీఓ దశరథ రామయ్య, ఖాతా రమేష్ రెడ్డి..
మిడుతూరు, (నందికొట్కూరు) న్యూస్ నేడు: ఇంటిని ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని మిడుతూరు ఎంపీడీవో పి దశరథ రామయ్య మరియు టీడీపీ మండల కన్వీనర్ ఖాతా రమేష్ రెడ్డి అన్నారు. శుక్రవారం”పచ్చదనం-పరిశుభ్రత”అనే కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్య కార్మికులతో కలిసి అధికారులు మిడుతూరులో చెత్తా చెదారాన్ని తొలగించారు.ప్రభుత్వ ఆదేశాల మేరకు మండలంలో ఒక గ్రామ పంచాయతీని ఎన్నుకొని ఆ గ్రామంలో అందరూ కలిసి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచాలనే ప్రభుత్వ లక్ష్యంతో మిడుతూరులో పోలీస్ స్టేషన్ ఎదుట,పంచాయతీ కార్యాలయం,తహసిల్దార్ కార్యాలయం,చెత్త సంపద కేంద్రం దగ్గర,మోడల్ స్కూల్ నుండి మండల పరిషత్ కార్యాలయం వరకు(ఆరు చోట్ల)కార్యాలయ ప్రాంతాల్లోవివిధ గ్రామాల పంచాయతీ కార్యదర్శులు మరియు కార్మికులు కలసి చెత్తా చెదారాన్ని ట్రాక్టర్లలో వేసి తొలగించారు.అదేవిధంగా కార్మికులు శుభ్రం చేసిన ప్రాంతాల్లో బ్లీచింగ్ పౌడర్ వేశారు.చెత్త సంపద కేంద్రాన్ని శుభ్రం చేశారు.ఈ సందర్భంగా గ్రామాల్లో ఎక్కడపడితే అక్కడ చెత్త చెదారం వేయకుండా పరిసరాలు శుభ్రంగా ఉంచుకుంటే రోగాలు రావని వారు అన్నారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవో సంజన్న, పంచాయతీ కార్యదర్శులు శివ కళ్యాణ్ సింగ్,సామెల్,సుగుణావతి,వినయ్ చంద్ర,కేశావతి,వినోద్ మరియు కార్మికులు పాల్గొన్నారు.

