NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం..

1 min read

మహానందికి వెళ్తుండగా దుర్ఘటన..

మిడుతూరు, న్యూస్​ నేడు:  ఓ వ్యక్తి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందినట్లు మిడుతూరు ఎస్ఐ హెచ్ ఓబులేష్ తెలిపారు.ఎస్సై తెలిపిన వివరాల మేరకు నందికొట్కూరు పట్టణం వాల్మీకి నగర్ కు చెందిన మండ్ల నారాయణ,రమణమ్మ కుమారుడు ఎం వెంకటేశ్వర్లు (36)కార్తీకాలు చివరి రోజు కావడంతో మహానంది దేవస్థానం దగ్గరికి వెళ్ళొస్తానని తల్లికి చెప్పి శుక్రవారం ఉదయం 4 గంటల సమయంలో తన పల్సర్ బైక్(ఏపీ 39 హెచ్ కే 7008) మహానందికి వెళుతుండగా మిడుతూరు మండలం తలముడిపి బ్రిడ్జి దగ్గర గుర్తుతెలియని వాహనం డీ కొట్టడంతో తన తలపై వాహనం వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడని ఎస్ఐ తెలిపారు. నందికొట్కూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు.అన్న శ్రీనివాసులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్సై తెలిపారు.

About Author