కూటమి లో మా వాట ఇవ్వాల్సిదే
1 min read

లేకపోతే బిజెపి సత్తా చూపిస్తాం
స్థానిక సంస్థల ఎన్నికల్లో ధైర్యంగా పోటీ చేయాలి
మంత్రాలయం లో వైకాపా ను భూస్థాపితం చేసేందుకు సిద్ధం కావాలి
బిజెపి జిల్లా అధ్యక్షులు టి. రామకృష్ణ, ఎమ్మెల్యే పార్థసారథి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పురుషోత్తం రెడ్డి
మంత్రాలయం న్యూస్ నేడు : మంత్రాలయం నియోజకవర్గం లో కూటమిలో బిజెపి కి ఇవ్వాల్సిన వాట ఇవ్వాల్సిందే నని లేకపోతే తమ సత్తా చూపిస్తామని బిజెపి జిల్లా అధ్యక్షులు అక్కమ్మ తోట రామకృష్ణ, ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సీనియర్ సుప్రీంకోర్టు న్యాయవాది పురుషోత్తం రెడ్డి హెచ్చరించారు. శనివారం సర్దార్ వల్లభాయ్ పటేల్ 150 వ జయంతి సందర్భంగా ఆ పార్టీ రాష్ట్ర నాయకులు సుప్రీంకోర్టు న్యాయవాది పురుషోత్తం రెడ్డి ఆధ్వర్యంలో విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద నుంచి రాఘవేంద్ర సర్కిల్ మీదుగా ర్యాలీ నిర్వహించారు. సర్కిల్లో రాఘవేంద్ర స్వామి విగ్రహాలకు పూలమాలలు వేశారు. అనంతరం కలుదేవకుంట గ్రామ సమీపంలో ఉన్న బిజెపి ఫాం హౌస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో మా పార్టీ నాయకులను విస్మరించి సమావేశాలు నిర్వహించడం బిజెపిని అవమానించడమే అవుతుందనే విషయాన్ని టిడిపి నాయకులు గుర్తుంచుకోవాలని లేని పక్షంలో రానున్న రోజుల్లో తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. కూటమి ఒప్పందం ప్రకారం టిడిపి నాయకులు ప్రవర్తించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మంత్రాలయం జనసేన ఇన్చార్జ్ బి లక్ష్మన్న, కోడుమూరు మాజీ ఎమ్మెల్యే మురళి కృష్ణ బీజెవైయం నాయకులు సునీల్ రెడ్డి , రాష్ట్ర కార్యదర్శి గీతా మధూరి , వాల్మీకి డైరెక్టర్ ఫెడరేషన్ మురళీ నాయుడు, విట్టా రమేష్ , ఇతర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

