NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పదిలో ఉత్తీర్ణత పెంచడమే లక్ష్యంగా ప్రణాళిక

1 min read

మండల విద్యాధికారి రాఘన్న

మంత్రాలయం న్యూస్ నేడు :  పదవ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం పెంచడమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని మండల విద్యాధికారి రాఘన్న పాఠశాలల ప్రధానోపాధ్యాయులు సూచించారు. శనివారం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణంలో మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులతో సమావేశం నిర్వహించి చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చదువు విషయంలో వెనుకంజలో ఉన్న విద్యార్థిని విద్యార్థుల పట్ల వంద రోజుల్లో ప్రణాళిక ప్రకారం తీర్చిదిద్దే బాధ్యత తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండలంలోని 13 పాఠశాలల సబ్జక్ట్ లస్కూల్ అసిస్టెంట్ల తో పాటు ప్రధానోపాధ్యాయులు విఠోభరావు, రాజశేఖర్, సుజాత, ప్రసాద్, శాంతి, పరిమళ జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

About Author