ప్రధానోపాధ్యాయులు కబీర్ సాబ్ కు ఘనంగా సన్మానం
1 min read
హొళగుంద న్యూస్ నేడు : మండల కేంద్రంలోని స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు కబీర్ సాబ్ కు శనివారం పాఠశాలలో పనిచేస్తున్న నూతన ఉపాధ్యాయులు శాలువా పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నూతన ఉపాధ్యాయులు మాట్లాడుతూ 2026 డీఎస్సీనుకు కొత్తగా నియా మకం పొందిన వారికి మొదటి నెల జీతాలు రావటంతో వారందరూ కలిసి ప్రధానోపా ధ్యాయులకు కృతజ్ఞతలు తెలుపుతూ ఘనంగా సత్కరించమన్నారు. అలాగే కూటమి ప్రభు త్వంలో మెగా డీఎస్సీ ద్వారా తమకు ఉద్యోగాలు రావడంతో ముఖ్యమంత్రి చంద్రబా బుకు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు వారు కృతజ్ఞ తలు తెలిపారు. ఈకార్యక్రమంలో నూతన ఉపాధ్యాయులు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

