NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కాల్వబుగ్గ పుణ్యక్షేత్రంలో ఆర్టీసీ బస్సులు తప్పనిసరిగా ఆగేలా చర్యలు  

1 min read

ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి కి విశ్వ హిందూ పరిషత్ – బజరంగ్ దళ్ వినతిపత్రం సమర్పణ

కర్నూలు, న్యూస్​ నేడు: విశ్వ హిందూ పరిషత్ – బజరంగ్ దళ్ ప్రతినిధులు నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ శ్రీమతి బైరెడ్డి శబరి గారిని మర్యాదపూర్వకంగా కలిసి కాల్వబుగ్గ పుణ్యక్షేత్రం వద్ద భక్తుల రవాణా సమస్యపై వినతిపత్రం అందజేశారు.ఉమ్మడి కర్నూలు జిల్లాలో అత్యంత పవిత్రమైన కాల్వబుగ్గ క్షేత్రం వద్ద ప్రతిరోజు వేలాది మంది భక్తులు దర్శనం కోసం వస్తున్నారు. అయితే ప్రస్తుతం ఆర్టీసీ బస్సులు చాలా తక్కువ సంఖ్యలో మాత్రమే ఆగడం వల్ల భక్తులు, ముఖ్యంగా మహిళలు–వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే స్పందించిన ఎంపీ  – తక్షణ చర్యలు ..వినతిపత్రం అందుకున్న వెంటనే నంద్యాల పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ బైరెడ్డి శబరి ,నంద్యాల జిల్లా ఆర్టీసీ మరియు కర్నూలు జిల్లా ఆర్టీసీ ఆర్ఎం అధికారులకు నేరుగా ఫోన్ చేసి :“ కాల్వబుగ్గ పుణ్యక్షేత్రానికి భక్తుల రాకపోకలు సౌకర్యంగా ఉండేలా అన్ని బస్సులు తప్పనిసరిగా ఆగేలా వెంటనే చర్యలు తీసుకోండి ”అని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఆర్టీసీ అధికారులు వెంటనే సానుకూలంగా స్పందించి, అన్ని విధానపరమైన చర్యలు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు.  ఎంపీ  మరో ముఖ్య హామీ — ఎంపీ నిధులతో బస్టాండ్ నిర్మాణం ఎంపీ  భక్తుల సమస్యను అత్యంత ప్రాధాన్యంతో పరిగణించి,కాల్వబుగ్గ పుణ్యక్షేత్రం వద్ద స్థిరమైన బస్టాండ్ నిర్మాణానికి తమ ఎంపీ నిధుల నుంచి నిధులు కేటాయిస్తామనిస్పష్టంగా ప్రకటించారు.ఈ నిర్ణయం భక్తులకు శాశ్వతంగా పెద్ద సౌకర్యాన్ని అందించనుంది. మా ప్రధాన డిమాండ్లు ప్రధాన మార్గాల్లో నడిచే అన్ని బస్సులు (డీలక్స్, ఎక్స్‌ప్రెస్, పల్లె వెలుగు) కాల్వబుగ్గ వద్ద ఆగేలా ఆదేశాలు . కాల్వబుగ్గ కోసం ప్రత్యేక “Kalvabugga Stop” టికెట్ స్టాప్ కేటాయింపు . బస్టాప్ బోర్డు/షెల్టర్ — ప్రస్తుతం ఎంపీ నిధులతో బస్టాండ్ నిర్మాణం త్వరలో ప్రారంభం కానుంది . వినతిపత్రం సమర్పణలో పాల్గొన్న నాయకులు టి. ప్రతాపరెడ్డి – విశ్వహిందూ పరిషత్ విశేష సంపర్క రాష్ట్ర ప్రముక్ గోవిందరాజులు – విశ్వహిందూ పరిషత్ కర్నూలు జిల్లా ఉపాధ్యక్షులురవీంద్ర గౌడ్ – విశ్వహిందూ పరిషత్ నాయకులు, సంగు రాంబాబు – విశ్వహిందూ పరిషత్ నాయకులు, శివపురం నాగరాజు – విశ్వహిందూ పరిషత్ నాయకులు, బజరంగ్ దళ్ నాయకులు : తెలుగు భగీరథ, శివ సాయినాథ్,  గుజరాతి సురేష్,  హరికృష్ణ, వడ్డే రాము, యశ్వంత్, తిమ్మారెడ్డి, ధరణి, శేఖర్, అభిఅలాగే విశ్వహిందూ పరిషత్ – బజరంగ్ దళ్ కు చెందిన పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.ఎంపీ తక్షణ స్పందన, ఆదేశాలు, మరియు ఎంపీ నిధులతో బస్టాండ్ నిర్మాణ హామీతో ఈ ప్రజా సమస్య శీఘ్రంగా పరిష్కరించబడుతుందని మా విశ్వాసం .

About Author