NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పత్తి పంటకు క్వింటాలకు  12 వేల రూ. లతో ప్రభుత్వమే కొనుగోలు చేయాలి 

1 min read

ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి. దిగూరి రాజా సాహెబ్ డిమాండ్

పత్తికొండ, న్యూస్​ నేడు:  పత్తి రైతులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే ఆదుకోవాలని, ఆత్మహత్యలను నివారించాలని, ఉచిత పంటల బీమా పథకం కొనసాగించాలని, పత్తికి కనీస మద్దతు ధర క్వింటాలకు  నుండి 12000 రూపాయలు ప్రకారం కొనుగోలు చేయాలని, సీసీఐ కొనుగోలు కేంద్రాలు తక్షణమే ఏర్పాటు చేసి రైతుల దగ్గరున్న పత్తి అంత కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో మంగళవారం  పత్తికొండ తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన నిరసన చేపట్టారు. అనంతరం డిప్యూటీ తహశీల్దార్ కు పత్తి రైతుల సమస్యలతో కూడిన వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పత్తికొండ మండల కార్యదర్శి కే సిద్దు అధ్యక్ష వహించగా ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి దిగూరి రాజా సాహెబ్  హాజరై మాట్లాడుతూ, ఈ ఏడాది అధిక వర్షాల వల్ల  జిల్లాలో దాదాపు రెండు లక్షల 25 వేల హెక్టార్లలో పత్తి పంట పూర్తిగా దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. భారీ వర్షాల వలన సాధారణ దిగుబడే 10 కింటాలు రావాల్సి ఉండగా కేవలం మూడు నాలుగు  క్వింటాలు మాత్రమే పత్తి దిగుబడి వచ్చిందని తెలిపారు. ఈ కొద్దిపాటి పంటమార్కెట్ కు తీసుకొని వస్తే క్వింటాల్ పత్తి 3000 నుండి 4000 రూపాయలులోపు ధర పలుకుతుందని అన్నారు. దీంతో పత్తి రైతులు క్వింటాల్ పత్తికి 6000 నుండి 7000 రూపాయల వరకు నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీసం మద్దతు ధర 8110 రూపాయలు ఎక్కడ అమలు కావడం లేదని తెలిపారు. ఈ ప్రాంతంలో పూర్తిగా నష్టపోయిన రైతులంతా  అప్పుల పాలై వలసలు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడిందని అన్నారు.

About Author