NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జ్యోతిరావు పూలే అదర్శంతో అనేక సేవా కార్యక్రమాలు

1 min read

ఆ పోరాటపటిమను ముందుకు తీసుకెళ్లే దిశగా ప్రతి ఒక్కరు పునరoకితం కావాలి

ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు:సమసమాజ స్థాపనే ధ్యేయంగా ప్రముఖ సంఘ సంస్కర్త జ్యోతిరావ్‌ ఫూలే అలుపెరుగని పోరాటం చేశారని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి కొనియాడారు. ఆయన పోరాట స్ఫూర్తితో ప్రతిఒక్కరూ పయనించాలని సూచించారు. ఏలూరు జ్యూట్‌మిల్‌ సెంటర్‌లో జరిగిన జ్యోతిరావ్‌ ఫూలే వర్థంతి కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా పాల్గొన్న ఎమ్మెల్యే చంటి.జెడ్పీ చైర్‌పర్సన్‌ ఘంటా పద్మశ్రీ, ఆర్టీసి విజయవాడ జోన్‌-2 చైర్మన్‌ రెడ్డి అప్పలనాయుడు, రాష్ట్ర వడ్డీల సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్‌పర్సన్‌ ఘంటసాల వెంకటలక్ష్మితో కలిసి జ్యోతిరావు ఫూలే, సావిత్రిబాయి ఫూలే దంపతుల విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ అన్నిరంగాల్లో బిసిలకు సమప్రాధాన్యత కల్పించాలనే లక్ష్యంతో జ్యోతిరావు ఫూలే చేసిన పోరాటాలు స్ఫూర్తిదాయకమని స్పష్టం చేశారు. ఆ పోరాట పటిమను ముందుకుతీసుకెళ్ళే దిశగా ప్రతిఒక్కరూ పునరంకితం కావాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఈడా చైర్మన్‌ పెద్దిబోయిన శివప్రసాద్‌, కో-ఆప్షన్‌ సభ్యులు ఎస్సెమ్మార్‌ పెదబాబు, పలువురు బిసి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

About Author