సందీప్ మక్తాలకు యూఏఈ గోల్డెన్ వీసా
1 min read

ప్రపంచ వేదికపై తెలుగు నాయకత్వానికి దక్కిన అత్యున్నత గౌరవం!
ఎటువంటి పెట్టుబడి లేకుండానే రాజభవన మద్దతుతో ఆమోదించిన గుర్తింపు
అరుదైన గోల్డెన్ వీసాతో మక్తాలాకు యూఏఈ ప్రభుత్వం పంపిన భారీ విశ్వాస సందేశం
యూఏఈ/హైదరాబాద్, న్యూస్ నేడు : యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అందించే అత్యంత అరుదైన ప్రతిష్ఠాత్మక గౌరవాలలో ఒకటైన ‘యూఏఈ గోల్డెన్ విసా’ను ప్రపంచ తెలుగు సమాచార సాంకేతిక మండలి ఛైర్మన్ సందీప్ మక్తాల అందుకున్నారు.రాస్ అల్ ఖైమా రాజభవనం మద్దతుతో ఈ అరుదైన గౌరవాన్ని అందుకున్న మొట్టమొదటి తెలుగు టెక్ లీడర్ సందీప్ మక్తాల కావడం విశేషం. ఇది కేవలం ఒక వీసా కాదు, సాంకేతికత, ఆవిష్కరణలు మరియు ప్రపంచ శాంతికి ఆయన చేస్తున్న అద్భుతమైన సేవలకు లభించిన అంతర్జాతీయ గుర్తింపు.ఈ ప్రతిష్టాత్మక 10 సంవత్సరాల రెసిడెన్సీ వీసా ఏ విధమైన పెట్టుబడి అవసరం లేకుండానే ప్రకటించబడింది. యూఏఈ ప్రభుత్వం అన్ని వీసా సంబంధిత ఖర్చులను సంపూర్ణంగా భరించడం ద్వారా, మక్తాలా గారి ప్రపంచ స్థాయి సేవలను గుర్తించింది. టెక్నాలజీ, ఆవిష్కరణల దౌత్యం, వ్యవస్థాపకత మరియు ప్రపంచ శాంతి చొరవల కార్యక్రమాల విభాగాల్లో మక్తాలా చేస్తున్న విశిష్ట సేవలకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ప్రపంచ తెలుగు సమాచార సాంకేతిక మండలి (డబ్ల్యూటిఐటిసి) చైర్మన్‌గా 63 దేశాలలోని 2,843 కంపెనీలను ప్రతినిధ్యం వహిస్తున్నారు. టిఐటిఏ గ్లోబల్ ప్రెసిడెంట్‌గా సేవలందిస్తూ, టీ కన్సల్ట్ మరియు తన మధ్యప్రాచ్య విస్తరణ మిషన్ ఎక్స్ పాన్ట్ ఎంఈ ద్వారా సరిహద్దులను దాటి ఇన్నోవేషన్‌కు తోడ్పడ్డారు. నోబెల్ పురస్కార గ్రహీతలు మద్దతు తెలిపిన ఆయన సైబర్ సత్యాగ్రహ పీస్ మిషన్ నైతిక సాంకేతికత మరియు శాంతి నిర్మాణంలో ప్రపంచవ్యాప్తంగా ఆయన ప్రభావం వెలుగులోకి తెచ్చింది. ఈ ప్యాలెస్-ఎండోర్స్డ్ గోల్డెన్ విసా అసాధారణ విశ్వాసానికి ప్రతీకగా నిలిచి, మక్తాలాను ఇన్నోవేషన్, శాంతి మరియు సహకారానికి గ్లోబల్ అంబాసడర్‌గా ప్రతిష్ఠిస్తోంది. ఇది యూఏఈ యొక్క ముందడుగు దృష్టికోణంతో పూర్తిగా అనుసంధానమై ఉంటుంది.

