ఎమ్మిగనూరు మండల కారు ప్రమాద బాధితులను పరామర్శించిన మంత్రి
1 min read
జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి
కర్నూలు , న్యూస్ నేడు: ఎమ్మిగనూరు మండలం కోటేకల్ గ్రామ సమీపంలో జరిగిన కారు ప్రమాద బాధితులను పరామర్శించిన మంత్రి టి.జి.భరత్ మరియు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి శనివారం ఉదయం రాష్ట్ర పరిశ్రమలు , వాణిజ్యం మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి. భరత్ మరియు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి , కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి కాజువాలిటీ విభాగాన్ని సందర్శించారు.కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం కోటేకల్ గ్రామ సమీపంలో జరిగిన ఘోర కారు ప్రమాద ఘటన లో గాయపడ్డ కర్ణాటక రాష్ట్ర కొల్లార్ జిల్లా బంగారు పేట వాస్తవ్యులు , ఒకే కుటుంబానికి చెందిన గంగమ్మ వయసు 55 సంవత్సరాలు మరియు చేతన్ కుమార్ వయసు 25 సంవత్సరాలు చికిత్స పొందుతున్న వారికి అందుతున్న చికిత్స వివరాల గురించి డాక్టర్ల తో అడిగి తెలుసుకున్నారు. వారికి అత్యంత మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు ను ఆదేశించారు. ఈ పర్యటనలో సర్వజన ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు, సి ఎస్ ఆర్ ఎమ్ పద్మజ , ఆర్ ఎం ఓ వెంకటరత్నం , డిసిహెచ్ఎస్ జఫరుల్లా, సంబంధిత డాక్టర్లు పాల్గొన్నారు.

