ఘనంగా ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం
1 min read

నందికొట్కూర్,మిడుతూర్,కడుమూర్’లో ర్యాలీ..
నందికొట్కూరు , న్యూస్ నేడు: డిసెంబర్ 1న ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు.నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో హాండ్స్ స్వచ్చంద సేవా సంస్థ మరియు ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా పట్టణంలో ర్యాలీ చేపట్టి పటేల్ సెంటర్లో విద్యార్థులు భారీగా మానవహారంగా ఏర్పడి ప్రతిజ్ఞ చేశారు.ముఖ్య అతిధిగా నందికొట్కూరు సీహెచ్ సి డాక్టర్ జిక్కీ ర్యాలీని ప్రారంభించారు.హాండ్స్ ప్రాజెక్ట్ మేనేజర్ నరసింహుడు మాట్లాడుతూ హెచ్.ఐ.వి అంటే ఏమిటి మరియు హెచ్.ఐ.వి ఎయిడ్స్ ఎలా వస్తుంది ఎలా రాదు వస్తే ఎలాంటి నివారణ చర్యలు తీసుకోవాలనే వాటి గురించి వివరించారు.మిడుతూరు మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ప్ల కార్డులు పట్టుకొని ర్యాలీ అనంతరం బస్టాండ్ కూడలిలో విద్యార్థులు మానవహారంగా ఏర్పడి ప్రతిజ్ఞ చేశారు.ఇన్చార్జి ప్రిన్సిపాల్ ఎం ఎల్లన్న,సీహెచ్సి డాక్టర్ తిరుపతి ఎయిడ్స్ గురించి మాట్లాడారు.తర్వాత కడుమూరులో డాక్టర్ రాజు, డాక్టర్ వ్యోమకేష్ ఆధ్వర్యంలో సిబ్బందితో కలిసి ఎయిడ్స్ గురించి ర్యాలీ చేపట్టారు.ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ పీఓ సురేష్ బాబు, అధ్యాపకులు జగన్,నరేంద్ర, హాండ్స్ స్టాఫ్ మేరీ,పద్మావతి, ఎంఅండ్ఈ జవాద్,సరోజ మరియు విద్యార్థులు పాల్కొన్నారు.


