NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఎన్టీఆర్ సామాజిక పెన్షన్లు పంపిణీ చేసిన శాసనసభ్యులు

1 min read

పత్తికొండ, న్యూస్​ నేడు:  కర్నూలు జిల్లా తుగ్గలి మండలం ఎద్దుల దొడ్డి గ్రామంలో నూతనంగా మంజూరైన వితంతు పెన్షన్లు మరియు వృద్ధులకు, వికలాంగులకు  ఎన్టీఆర్ సామాజిక పెన్షన్లను స్థానిక శాసనసభ్యులు కేఈ శ్యాం కుమార్ సోమవారం లబ్ధిదారుల ఇంటిక వద్దకు వెళ్లి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కే ఈ శ్యాం కుమార్ మాట్లాడుతూ, గతంలో 200 రూపాయలు ఉన్న పెన్షన్‌ని మన సీఎం చంద్రబాబు నాయుడు 2000 రూపాయలకు పెంచారని అన్నారు . ఇప్పటి ప్రతిపక్ష నాయకుడు జగన్ రెండు వేల పెన్షన్ను 3000 రూపాయలు చేస్తానని మాట ఇచ్చి మడమ తిప్పారని ఎద్దేవా చేశారు. 250 రు. ల ప్రకారం వంతులవారీగా నాలుగు సంవత్సరాల తర్వాత  3000 రూపాయలు చేశారని అన్నారు. ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలన్నీ అమలు చేస్తున్నామని అన్నారు. ఎన్నికల కంటే ముందు ఇచ్చిన మాట ప్రకారం నాలుగు వేల పెన్షన్ను కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందని తెలిపారు. తెలుగుదేశం పార్టీది మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం అని అన్నారు. కూటమి ప్రభుత్వంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ,ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు , డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహకారంతో ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెడుతుందన్నారు. రాబోయే రోజుల్లో ఇచ్చిన హామీలు అన్ని అమలు చేసి ప్రజల నమ్మకాన్ని విశ్వాసాన్ని నిలబెట్టుకుంటాం అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో  ఎమ్మెల్యే గారి తో పాటు జనసేన నియోజకవర్గ ఇన్చార్జ్ రాజశేఖర్, గ్రామ సర్పంచ్ రాముల విజయ్, మారెళ్ళ సొసైటీ చైర్ పర్సన్ ప్రభాకర్ రెడ్డి, శ్రీనివాసులు గౌడ్ , మండల కన్వీనర్ తిరుపాలు, పొన్నె రంగప్ప రాజు, వీరేష్ గౌడ్,బొమ్మిరెడ్డి, రవి కుమార్, ఎద్దులదొడ్డి,కోతికొండ గ్రామ నాయకులు, మండల నాయకులు, అధికార సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

About Author