జూట్ కార్మికులకు ఈఎస్ఐ ద్వారా అన్-ఎంప్లాయిమెంట్ బెనిఫిట్స్ ఇప్పించాలి
1 min read

ఏలూరు ఎమ్మెల్యే ,ఎంపీ ని కోరిన ఐఎఫ్ టియు బృందం
ఢిల్లీలో ఇఎస్ఐ అధికారులతో మాట్లాడతానని హామీ ఇచ్చిన ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఏలూరు,కొత్తూరు జూట్ మిల్లులు అర్ధాంతరంగా మూసివేసిన కారణంగా ఈఎస్ఐ ద్వారా కార్మికులకు రావలసిన అన్-ఎంప్లాయిమెంట్ బెనిఫిట్స్ ని ఇప్పించే విధంగా చూడాలని కోరుతూ ఐ.ఎఫ్.టి.యు. ప్రతినిధి బృందం ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి,ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ని కలిసి వినతి పత్రం సమర్పించారు. ఎం.ఎల్.ఎ. ద్వారా ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ గారిని కూడా కలిసి వినతి పత్రం సమర్పించారు.ఎం.పి. సానుకూలంగా స్పందించారు. అన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. తాను ఢిల్లీ వెళుతున్నాననీ, డిసెంబర్ 3 లేదా 4న ఢిల్లీ లో ఈఎస్ఐ అధికారులతో మాట్లాడి అన్- ఎంప్లాయిమెంట్ బెనిఫిట్స్ వచ్చే విధంగా చూస్తానని హామీ ఇచ్చారు. తన పిఏ ద్వారా ఎప్పటికప్పుడు విషయాలు తెలియజేస్తానని కూడా చెప్పారు.ఈ విషయాన్ని తన పర్సనల్ డైరీ లో రాసుకున్నారు. ఈ విధంగా వెంటనే స్పందించిన ఎం.పీ. కి, ఎమ్మెల్యే కి ఐఎఫ్ టియు తరుపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం .అన్ ఎంప్లాయిమెంట్ బెనిఫిట్ త్వరలోనే వస్తుందని ఆశిద్దాం . ఒక వేళ రాకపోతే మనం తగిన కార్యాచరణ రూపొందించుకోవడానికి ఏలూరు, కొత్తూరు కార్మికులు సిద్ధంగా ఉండవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.మంగళవారం ఎమ్మెల్యే ని, ఎంపీ ని కలిసిన ప్రతినిధి అందంలో ఐ.ఎఫ్.టి.యు. రాష్ట్ర సహాయ కార్యదర్శి యు.వి. రాష్ట్ర కమిటీ సభ్యులు బి.సోమయ్య, ఏలూరు జూట్ మిల్లు ఇఫ్టూ కార్యకర్తలు కోసూరి నూకరాజు, బగాది రమణ, కింతల చిట్టయ్య, బుడుమూరి శ్రీను, బుద్ధా నాగేశ్వరరావు,తెంటు సింహాచలం, త్రినాథ్, కొత్తూరు జూట్ మిల్లు కార్యకర్తలు ఆర్నేపల్లి దుర్గారావు, వి.వెంకట్రావు,బాలాజీ,కప్పా దుర్గారావు తదితరులు ఉన్నారు.


