NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రాష్ట్ర స్థాయి ఫుట్ బాల్ పోటీల్లో  కేఎంసి విద్యార్థులు ప్రతిభ

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ  రాష్ట్ర స్థాయి పోటీల్లో  కేఎంసి   ఫుట్ బాల్ టీమ్ కు రన్నర్స్ అప్… అభినందనలు తెలిపిన ఎ.డిఎం.ఇ & కర్నూలు మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ చిట్టి నరసమ్మ……   డా. ఎన్టీఆర్ యూనివర్సిటీ అఫ్ హెల్త్ సైన్సెస్ వారు నిర్వహించిన 27వ మెడికల్ మరియు డెంటల్ అంతర్ కళాశాల ఆటల పోటీలలో  ఫుట్ బాల్ యందు కర్నూల్ మెడికల్ కాలేజ్ చెందిన వైద్య విద్యార్థుల ఫుట్ బాల్ టీం ఫైనల్ కు చేరుకొని ఫైనల్ పోటీల్లో రన్నర్స్ గా నిలిచి  రెండవ స్థానం సాధించడం జరిగింది. కేఎంసీ వైద్య విద్యార్థులు వైద్య విద్యతో పాటు ఆటల  పోటీల్లో కూడా రాణిస్తుండడం  పట్ల ప్రిన్సిపల్ సంతోషాన్ని  తెలియచేస్తూ పోటీలో గెలుపొందిన విద్యార్థులను అభినందించారు. అందుకు కృషిచేసిన ఫిజికల్ డైరెక్టర్స్ ను, స్పోర్ట్స్ కమిటీ కు   అభినందనలు తెలిపారు.. ఈ అంతరాష్ట్ర మెడికల్ కళాశాలల పోటీలు జిఎస్​ఎల్​ మెడికల్ కాలేజీ రాజమండ్రి నందు 29-11-2025నుండి 30-11-2025 వరకు జరిగాయి. ఇందులో ఫుట్బాల్ నందు 22 కాలేజీలు వాలీబాల్ నందు 32 కాలేజీలు చెస్ నందు 23కాలేజీలు పాల్గొన్నాయి. వీటిలో కర్నూల్ వైద్యాకళాశాల విద్యార్థులు ఫుట్బాల్ నందు ఫైనల్ కి చేరి రన్నర్స్ అప్ గా  నిలిచారు. పోటీల్లో గెలుపొందిన విద్యార్థుల టీం సహకరించిన సిబ్బంది ప్రిన్సిపల్ ను కలవడం జరిగింది. ఈ కార్యక్రమము లో కాలేజి స్పోర్ట్స్ కమిటీ వైస్ చైర్మన్ డా.విద్యా సాగర్, మెడిసిన్ హెచ్ ఓ డి డా. శ్రీరాములు, సభ్యులు డా. విజయశంకర్. డా. సోమశేఖర్, డా. విజయ్ బాబు,డా. ప్రవీణ మరియు ఫిజికల్ డైరెక్టర్ రామకృష్ణ, ప్రసాద్ పాల్గొన్నారు.

About Author