మొండి బకాయిదారులపై కొనసాగుతున్న కొరడా
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: గురువారం నగరపాలక సంస్థకు పన్నులు చెల్లించని మొండి బకాయిదారులపై అధికారుల కొరడా కొనసాగుతోంది. రెండో రోజు గురువారం కిడ్స్ వరల్డ్ సమీపంలోని నేషనల్ టీ స్టాల్ & స్వీట్ షాపునకు సంబంధించి రూ.6.58 లక్షలు, రాత్రి స్టేట్ గీతాంజలి నర్సింగ్ కాలేజీకి సంబంధించి రూ.5.53 లక్షల బకాయలు ఉండటంతో సదరు రెండు వ్యాపార సముదాయాలను సీజ్ చేశారు. అదనపు కమిషనర్ ఆర్జివి కృష్ణ, డిప్యూటీ కమిషనర్ సతీష్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో మొండి బకాయిదారుల వసూళ్లపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ మాట్లాడుతూ.. 6 సంవత్సరాలకు పైగా ఆస్తి పన్ను చెల్లించకపోతే ఆర్.ఆర్. యాక్ట్ ప్రకారం ఆస్తి జప్తునకు కోర్టు నందు చార్జీషిట్ దాఖలు చేయడం జరుగుతుందని, రూ.130 కోట్ల వరకు బకాయిలు ఉన్నాయని కార్పొరేషన్‌కి ఆర్థిక నష్టం కలిగించే విధంగా బకాయిదారులు వ్యవహరించవద్దని సూచించారు. నగర ప్రజలకు కేఎంసి సిటిజన్ ఫ్రెండ్లీగా ఉంటుందని, అధిక పన్ను బకాయిదారులను తగ్గిస్తున్నామని పేర్కొన్నారు. ఏవైనా ఆస్తి పన్ను ఎక్కువగా ఉంటే విస్తీరణం, పొరపాట్లు ఉంటే సరిచేస్తామని, అంతేతప్ప ఏళ్ళ తరబడి పెండింగ్‌లో ఉంటే ఏమీ చేయలేమన్నారు.కార్యక్రమంలో ఆర్ఓ జునైద్, ఆర్ఐలు రాజు, శ్రీకాంత్, భార్గవ్, కె.శంకర్ తదితరులు పాల్గొన్నారు.

