జిల్లా పరిషత్ హై స్కూల్లో తల్లితండ్రుల, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం
1 min read

విజయవాడ, న్యూస్ నేడు: ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని, విద్యార్థులకు అనేక రకాల వసతులు, సౌకర్యాలు కల్పిస్తుందని రాష్ట్ర గౌడ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ శివరాం ప్రసాద్ గౌడ్ అన్నారు. యనమలకుదురు లోని జిల్లా పరిషత్ హై స్కూల్ లో శుక్రవారం జరిగిన తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యా శాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ పిల్లల చదువులు విద్యార్థిని విద్యార్థులకు అందుతున్న వసతులు పై ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారని, పిల్లలకు ఎటువంటి ఇబ్బందులు వచ్చినా ఉపేక్షించరు అన్నారు. తదనానంతరం ఈ సమావేశంలో స్కూల్ హెచ్. ఎం .కే .శిరీష మాట్లాడుతూప్రతి ప్రభుత్వ పాఠశాలల్లో కూటమి ప్రభుత్వం నెల వారి కార్యక్రమాల అకాడమిక్ క్యాలెండర్, అందమైన రంగులతో పాఠ్యపుస్తకాలు, ఆకర్షనీయంగా నాణ్యమైన అసైన్మెంట్ బుక్స్,హోలిస్ స్టిక్ ప్రోగ్రెస్ కార్డు, ఫుల్ యూనిఫామ్, నైతిక విలువలు విద్య, ఆడపిల్లలకు కరాటే నేర్పించడం, రోజువారి టాయిలెట్ క్లీన్ చేయడానికి కెమికల్స్ వాడటం, లైబ్రరీ బుక్స్, స్పోర్ట్స్ కిట్స్, విద్యా శక్తి ద్వారా అదనపు బోధన, మాక్ అసెంబ్లీ,స్వేచ్ఛా ప్రోగ్రాం ద్వారా ఆడపిల్లలకు సానిటరీ నాప్కిన్సు, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా పిల్లలకు రుచికరమైన ఆహారం,ఐరన్ టాబ్లెట్స్, మనబడి మన భవిష్యత్తు పథకం ద్వారా పాఠశాల అవసరాలు,డిసెంబర్ 6 నుండి ఎస్.ఎస్.సి విద్యార్థులకు యాక్షన్ ప్లాన్,తల్లికి వందనం స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాలు,ఎస్ ఎస్ సి విద్యార్థులకు షిన్నింగ్ స్టార్స్,రైజింగ్ స్టార్స్ గా స్టడీ మెటీరియల్స్ ఇలాగ ఎన్నో రకాల కార్యక్రమాలు కూటమి ప్రభుత్వం చేపడుతుందన్నారు. పిల్లలు బాగా చదువుకుని, అభివృద్ధి చెందాలని లక్ష్యంతో నారా లోకేష్ గారి పని చేస్తున్నారని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ,, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ ప్రభుత్వ పాఠశాలలపై ప్రత్యేక దృష్టి సారించారన్నారు. ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు ఎటువంటి ఇబ్బందులు వచ్చినా స్థానిక కూటమి నాయకులు అందుబాటులో ఉంటారని, పిల్లల తల్లిదండ్రులు అధైర్య పడనవసరం లేదన్నారు. పిల్లల తల్లితండ్రులు కూడా ఈ విషయాలు దృష్టిలో పెట్టుకొని కూటమి ప్రభుత్వానికి సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో నాయకులు సిహెచ్ శేషు, బలగం కొండా, సజ్జఏడుకొండలు,ఏసురత్నం,డి నిలిమా,ఎన్. జోజయ్య,ఎస్ ఎం సి చైర్మన్ కె.దేవి,టీచర్ ఎస్.బదిరినారాయన,డి.నీలిమ మరియు పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు.


