NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఎక్క్సైజ్​ సిబ్బంది రక్తదానం

1 min read

‘జెమ్​ కేర్​ కామినేని’ ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు

  • అభినందించిన ఎక్సైజ్​ డి.సి శ్రీదేవి

కర్నూలు, న్యూస్ నేడు: తలసేమియా బాధితుల కోసం ఎక్సైజ్​ శాఖ కానిస్టేబుళ్లు, హెడ్​ కానిస్టేబుళ్లు శనివారం ఆ శాఖ జిల్లా కార్యాలయ ఆవరణలో రక్తదానం చేశారు. నగరంలోని జెమ్​ కేర్​ కామినేని హాస్పిటల్​ సహకారంతో వైద్య శిబిరం నిర్వహించారు. కార్యక్రమాన్ని ఎక్సైజ్​ డిప్యూటీ కమిషనర్​ శ్రీ దేవి, అసిస్టెంట్​ కమిషనర్​ హనుమంత రావు, సూపరింటెండెంట్​ సుధీర్​ బాబు , ఎన్​ ఫోర్స్​ మెంట్​ సీఐ రాజశేఖర్ గౌడ్​ ప్రారంభించారు.  ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన ఎక్కైజ్​ సిబ్బంది 50 మంది రక్తదానం చేశారు. జెమ్​ కేర్​ కామినేని హాస్పిటల్​ వైద్యులు   ఎక్కైజ్​ సిబ్బందికి వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందజేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్​ శ్రీ దేవి మాట్లాడుతూ జిల్లాలో తలసేమియా బాధితులు సమయానికి రక్తం అందక తీవ్ర అనారోగ్య సమస్యతో బాధ పడుతున్నారని, అలాంటి వారి కోసం తమ శాఖ కానిస్టేబుళ్లు, హెడ్​ కానిస్టేబుళ్లు రక్తదానం చేయడం అభినందనీయమన్నారు. అదేవిధంగా జెమ్​ కేర్​ కామినేని హాస్పిటల్​ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారని,  హాస్పిటల్​ సీఈఓ చంద్ర శేఖర్​ కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో  కానిస్టేబుళ్లు, హెడ్​ కానిస్టేబుల్​ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు వై.వి. గిరి బాబు, జెమ్​ కేర్​ కామినేని హాస్పిటల్​ జనరల్​ మేనేజర్​ రమణ తదితరులు పాల్గొన్నారు.

About Author