ఎక్క్సైజ్ సిబ్బంది రక్తదానం
1 min read

‘జెమ్ కేర్ కామినేని’ ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు
- అభినందించిన ఎక్సైజ్ డి.సి శ్రీదేవి
కర్నూలు, న్యూస్ నేడు: తలసేమియా బాధితుల కోసం ఎక్సైజ్ శాఖ కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్లు శనివారం ఆ శాఖ జిల్లా కార్యాలయ ఆవరణలో రక్తదానం చేశారు. నగరంలోని జెమ్ కేర్ కామినేని హాస్పిటల్ సహకారంతో వైద్య శిబిరం నిర్వహించారు. కార్యక్రమాన్ని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీ దేవి, అసిస్టెంట్ కమిషనర్ హనుమంత రావు, సూపరింటెండెంట్ సుధీర్ బాబు , ఎన్ ఫోర్స్ మెంట్ సీఐ రాజశేఖర్ గౌడ్ ప్రారంభించారు. ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన ఎక్కైజ్ సిబ్బంది 50 మంది రక్తదానం చేశారు. జెమ్ కేర్ కామినేని హాస్పిటల్ వైద్యులు ఎక్కైజ్ సిబ్బందికి వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందజేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ శ్రీ దేవి మాట్లాడుతూ జిల్లాలో తలసేమియా బాధితులు సమయానికి రక్తం అందక తీవ్ర అనారోగ్య సమస్యతో బాధ పడుతున్నారని, అలాంటి వారి కోసం తమ శాఖ కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్లు రక్తదానం చేయడం అభినందనీయమన్నారు. అదేవిధంగా జెమ్ కేర్ కామినేని హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారని, హాస్పిటల్ సీఈఓ చంద్ర శేఖర్ కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుల్ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు వై.వి. గిరి బాబు, జెమ్ కేర్ కామినేని హాస్పిటల్ జనరల్ మేనేజర్ రమణ తదితరులు పాల్గొన్నారు.


