ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా “వన్-కే వాక్” ర్యాలీ
1 min read

స్వేచ్ఛ, సమానత్వంతో ప్రతి పౌరుడు జీవించే హక్కును కాపాడవలసిన బాధ్యత మనందరిపై ఉంది
వివక్షలేని నవసమాజం,విద్య, ఆరోగ్యం,పనిచేసే హక్కు ప్రాముఖ్యతను అందరికీ తెలియ చెప్పాలి
ఉమ్మడి జిల్లా రెండవ అదనప జిల్లా జడ్జి యు.ఇందిరా ప్రియదర్శిని
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: జాతీయ న్యాయసేవాధికార సంస్థ, న్యూఢిల్లీ మరియు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అమరావతి వారి ఆదేశాలు ప్రకారం, బుధవారం ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా జిల్లా కోర్టు ప్రాంగణము నుండి “వన్-కే వాక్” ర్యాలీని జెండా ఊపి, ఉమ్మడి జిల్లా రెండవ అదనప జిల్లా జడ్జి శ్రీమతి యు.ఇందిరా ప్రియదర్శిని కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లా రెండవ అదనపు జిల్లా జడ్జి యు.ఇందిరా ప్రియదర్శిని మాట్లాడుతూ ప్రపంచ మానవ హక్కుల దినోత్సవ సందర్భంగా పౌరులను చైతన్య పరచడం కోసం ఈ ర్యాలీ నిర్వహించడం జరిగిందని తెలిపారు. ప్రతి మనిషి స్వతంత్రముగా జీవించి, తన మనుగడను కాపాడు కోవడానికి హక్కులు సహకరిస్తాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏడవ అదనపు జిల్లా జడ్జి వై.శ్రీనివాసరావు,జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్నప్రసాదు, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కె.కె.వి.బులికృష్ణ, అదనపు సీనియర్ సివిల్ జడ్జి పి.యస్. వి.బి.కృష్ణ సాయి తేజ మరియు ఇతర న్యాయ మూర్తులు, లోక్ అదాలత్ మెంబరు అబ్భినేని విజయ కుమార్, బార్ అసోసియేషన్ ప్రెసిడెంటు కోనె సీతారాం,ఎ.జి.పి.గెల్లా శ్రీనివాసరావు,ఇతర న్యాయవాదులు,పోలీసు సిబ్బంది, ఉమెన్ వెల్ఫేరు డిపార్ట్మెంటు పిడి రమాదేవి, క్రాఫ్ ఎన్జీవో వినోద్,తదితరులు పాల్గొన్నారు.

