పేదల జీవన పరిమాణ స్థాయిని పెంచేందుకు మెప్మా కృషి చేస్తుంది
1 min read

జిల్లా కలెక్టర్ కె.వెట్రీ సెల్వి
పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ వార్షిక సంచిక ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ : పెంచేందుకునేడు:పట్టణ పేదల జీవన ప్రమాణ స్థాయిని పెంచేందుకు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) కృషి చేస్తుందని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి చెప్పారు. స్థానిక కలెక్టరేట్ లో బుధవారం మెప్మా 2024-25 వార్షిక సంచికను కలెక్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ పట్టణ ప్రాంతాలలోని నిరుపేదల జీవనప్రమాణాలను మెరుగుపరిచేందుకు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నదని, ముఖ్యంగా మహిళల ఆర్థిక సాధికారత కొరకు కృషి చేస్తున్నదన్నారు. కుటుంబం -ఒక వ్యాపారవేత్త అనే ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా పట్టణ మహిళల కు ఆర్థిక సహకారం,శిక్షణ, నైపుణ్యాల అభివృద్ది ద్వారా సుస్థిర జీవనోపాధులను ఏర్పాటు చేయడం లో టెక్నాలజీ ను జోడించి వినూత్న రీతిలో వివిధ అవకాశాలను కల్పిస్తుందన్నారు. మహిళలు, నిరుపేదలు ప్రభుత్వం అందించే కార్యక్రమాలను సద్వినియోగంచేసుకుని ఆర్థికాభివృద్ధి సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ డైరెక్టర్ పి. మాధవి, జీవనోపాధుల జిల్లా సమన్వయ కర్త మహాలక్ష్మి, సంస్థాగత నిపుణులు యం.రమేష్, ప్రభృతులు పాల్గొన్నారు.

