NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జనాభా ప్రాతిపదికన బహుజనులకు అన్ని రంగాల్లో అవకాశాలు కల్పించాలి

1 min read

ఏఐ బహుజన్ సమాజ్ పార్టీ రీజనల్ కో-ఆర్డినేటర్ బక్కా పరంజ్యోతి

 ప్రైవేట్ రంగాలలో కూడా బహుజనులకు రిజర్వేషన్ కల్పించాలి

డా:ఎన్ఏడి పాల్ రాష్ట్ర అధికార ప్రతినిధి

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: జనాభా ప్రాతిపదికన బహుజనులకు అన్ని రంగాల్లో అవకాశాలు కల్పించాలని ఆలిండియా బహుజన్ సమాజ్ పార్టీ రీజనల్ కో-ఆర్డినేటర్ బక్క పరంజ్యోతి కోరారు. స్థానిక ఎన్ ఆర్ పేట లోని సంఘం జిల్లా కార్యాలయంలో బుధవారం సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశంలో 80% ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వాలు వైఫల్యం అయ్యాయని అన్నారు. చంద్రబాబు ప్రభుత్వం నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో విఫలమైందని తెలిపారు. ఎన్నికల హామీలను అమలు చేయడం లేదని విమర్శించారు. ఏఐబిఎస్పి రాష్ట్ర అధికార ప్రతినిధి ప్రొఫెసర్ డా:ఎన్ఏడి పాల్ మాట్లాడుతూ ఈరోజు ఏలూరు జిల్లా ఏలూరు కార్యాలయంలో సుమారు 50 మంది జాయిన్ అవ్వటం చాలా సంతోషదాయకంగా ఉందని. ఎన్నో ఏళ్లుగా రెడ్డి,రాజు,కమ్మ మాత్రమే పరిపాలించారని. కానీ మార్పు కోసం బహుజన్ రాజ్యం రావాలన్న అంబేద్కర్, ఫూలే, కాన్సిరాం,పెరియార్  కన్నకలలు కల్లాలుగానే మిగిలిపోయాయి అన్నారు. బహుజన్ రాజ్యాధికారి కోసం ఎస్సీలు, బీసీలు, మైనార్టీల సమస్యలు భారతదేశ సమస్యలుగా బహుజన సమస్యలుగానే నేటి పాలకుల వలన మిగిలిపోయాయి అన్నారు. అంబేద్కర్ అన్న మాటలు రాసుకోండి గోడల మీద నా ప్రజలు బానిసలుగా కాకుండా పాలకులుగా రాజాధికారులుగా ఎదుగుతారు.అన్న దానికి నిదర్శనమే ఏఐ బహుజన్ సమాజ్ పార్టీ ఏర్పడిందన్నారు. మేము ప్రభుత్వాన్ని ఒకటే హెచ్చరిస్తున్నాము ప్రతీది ప్రైవేటీకరణ చేస్తున్నారు. కాబట్టి ప్రైవేటీకరణలో కూడా మా బహుజనులకు రిజర్వేషన్లు కల్పించే విధంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మొలకాల సత్యనారాయణ,జిల్లా ఉపాధ్యక్షులు అందుగుల రవికాంత్,ఏలూరు పట్టణ ఇంచార్జ్ జక్కుల మేరీ పూజ, కైకలూరు ఇంచార్జ్ మన్నేపల్లి నాగేశ్వరరావు,చింతలపూడి నియోజకవర్గ ఇన్చార్జ్ ఉప్పె వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు.

About Author