NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కోటి సంతకాల శాంతియుత ర్యాలీ

1 min read

జిల్లా కేంద్ర కార్యాలయం నుండి విజయ హారర్ సెంటర్ వరకు సాగింది

భారీ ఎత్తున పాల్గొన్న వైసీపీ పార్టీ శ్రేణులు

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: వై యస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వై యస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశానుసారం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ చేసిన కోటి సంతకాలు ప్రజా ఉద్యమం కార్యక్రమంలో భాగంగా సేకరించిన వినతి పత్రంలతో చివరి రోజు బుధవారం ఏలూరు నియోజకవర్గంలో జరిగిన శాంతి యుత ర్యాలీ దిగ్విజయంగా కొనసాగింది. వై యస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు జిల్లా నియోజకవర్గ  కార్యాలయం నుండి ఆర్ఆర్ పేట విజయ విహార్ సెంటర్ వరకు భారీ ఎత్తున ర్యాలీగా వైయస్సార్ పార్టీ శ్రేణులు చేరుకున్నారు. అక్కడ దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహానికి,వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఏలూరు నియోజకవర్గం ఇంచార్జీ మామిళ్ళపల్లి జయప్రకాష్  ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంనకు ముఖ్య అతిథులుగా శాసనమండలి సభ్యులు వంకా రవీంద్ర పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా, నగర స్థాయి నాయకులు,మహిళా నాయకురాలు, కార్పొరేటర్లు  కార్యకర్తలు,అభిమానులు పాల్గొని కార్యక్రమం విజయవంతం చేశారు.

About Author