NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఎస్సీ సామాజిక వర్గాలలోని  ప్రధాన ఉప కులాలైన వారికి రాజకీయ ప్రాధాన్యత కల్పించాలి

1 min read

తెలుగు రాష్ట్రాల అసెంబ్లీ స్థానాల పెంపు సాధన సమితి అధ్యక్షులు డా:పొలిమేర హరికృష్ణ

జాతీయ రౌండ్ టేబుల్ సమావేశంలో 12 అంశాలతో కూడిన ఎజెండా ప్రవేశపెట్టి అనుమతి

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఎస్సీ సామాజిక వర్గలలో ని ప్రధాన ఉప కులాలైన మాదిగ, మాల,రెల్లి  ఉప కులాలైన సామాజిక వర్గాలకు రాజకీయ ప్రాధాన్యం కల్పించాలని. తెలుగు రాష్ట్రాల అసెంబ్లీ స్థానాల పెంపు సాధన సమితి అధ్యక్షులు డా:పొలిమేర హరికృష్ణ  పేర్కొన్నారు. దళిత జేఏసీ ఆధ్వర్యంలో జాతీయ రౌండ్ టేబుల్ సమావేశం ఫైర్ స్టేషన్ సెంటర్ డాక్టర్:యార్లగడ్డ జగన్మోహన్ రావు రోడ్డు వి.వి.ఏసీ/ఫంక్షన్ హాల్ లో  ఏర్పాటు చేయడమైనది. తెలుగు రాష్ట్రాల్లోని సీనియర్ దళిత నేతలంతా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సమావేశo సందర్భంగా డాక్టర్:పొలిమేర హరికృష్ణ మాట్లాడుతూ గతంలో చంద్రబాబు నాయుడు సీఎం గా పనిచేసిన కాలంలో ఎన్ ఎస్ ఎఫ్ బీసీ పథకం ద్వారా దళిత నిరుద్యోగులకు ఉపాధి,ఉద్యోగ అవకాశాలు కల్పించారన్నారు. మళ్లీ ఈ పథకాన్ని పునరుద్ధరణ చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలన్నారు. భారత కరెన్సీ పై అంబేద్కర్ రూపాన్ని ముద్రించాలని అన్నారు. సంస్థల ఎన్నికల్లో రొటేషన్ పద్ధతిలో ఎస్సీ,ఎస్టీలకు అన్యాయం జరగకుండా చూడాలన్నారు. 12 అంశాలతో కూడిన ఎజెండాను ప్రవేశపెట్టి అనుమతించారు. ఈ సభా సమావేశంలో ఉపాధ్యాయ మాజీ ఎమ్మెల్సీ రాము.సూర్యారావు (ఆర్ఎస్ఆర్. మాస్టారు) చింతలపూడి మాజీ ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలిజా, దళిత జేఏసీ జాతీయ చైర్మన్  పెరికె.వరప్రసాదరావు, జుజ్జువరపు రవి ప్రకాష్ , మున్నుల జాన్ గురునాథ్,మాజీ లిడ్ క్యాప్ డైరెక్టర్ సోoగ సందీప్, సంఘసంస్కర్త అలుగు ఆనంద్, నేతల రమేష్ బాబు,మెoడెం సంతోష్ , డా:డిఎన్ఏ పాల్, మత్తే బాబి,సిటిఓ మాముడూరి  మహంకాళి, డిఈ దేవరకొండ వెంకటేశ్వర్లు,సొంగ  మధుసూదన్ రావు, కార్పొరేటర్లు ఇనపనూరి జగదీష్ , జుజ్జువరపు విజయ,డింపుల్ జోష్ , సిపిఐ రాష్ట్ర నాయకులు బండి వెంకటేశ్వరరావు, ఉప్పులూరి హేమ శంకర్, అరుణతార నాగేశ్వరరావు, మాజీ ఎంపీపీ నిమ్మకూరు కిరణ్ కుమార్ మరియు వివిధ ప్రాంతాల నుండి వివిధ హోదాల దళిత నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

About Author