గ్రామాల్లో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడిన ఉపేక్షించకండి
1 min read

పోలీస్ అధికారులకు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆదేశాలు
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: దుగ్గిరాల క్యాంపు కార్యాలయంలో పెదవేగి పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ గా బాధ్యతలు తీసుకున్న ఎస్సై మాడాల హరి గోపాల్ దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించారు.గత ఐదేళ్ల వైసిపి ప్రభుత్వ హయాంలో నిత్యం వివాదాలు, అక్రమాలు,అసాంఘిక కార్యక్రమాలు, అమాయకులపై తప్పుడు కేసులు,దాడులతో దెందులూరు నియోజకవర్గ ప్రజలు తీవ్ర ఇబ్బందుల పాలయ్యారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శాంతిభద్రతల పరిరక్షణకు తొలి ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందని, గ్రామాలన్నీ ఎంతో ప్రశాంతంగా ఐకమత్యంగా ఉంటున్నాయని, అటువంటి వాటిని తిరిగి మరోసారి అలజడలు సృష్టించి గ్రామాల్లో ప్రశాంతత దెబ్బతీయాలని ఎవరు ప్రయత్నించినా, అదేవిధంగా అసాంఘిక కార్యక్రమాలు అక్రమాలకు ఎవరు పాల్పడినా కూడా వారిని ఉపేక్షించకుండా పట్టపరమైన చర్యలు తీసుకుని సమర్థవంతంగా విధులు నిర్వహించాలని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పోలీస్ అధికారులకు సూచించారు.ఇటీవల పెదవేగి పోలీస్ స్టేషన్ నూతన సబ్ ఇన్స్పెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన మడాల హరి గోపాల్ దుగ్గిరాల లోని క్యాంపు కార్యాలయంలో గురువారం ఉదయం దెందులూరు ఎమ్మెల్యే ప్రభాకర్ ని మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు.ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన సబ్ ఇన్స్పెక్టర్ కి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ నియోజకవర్గ ప్రజల పట్ల బాధ్యతయుతంగా పనిచేయాలని సూచిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.

