‘ మెడికవర్ , లో ప్రత్యేక కార్డియాక్ వింటర్ ప్యాకేజ్ ప్రారంభం
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: చలి కాలంలో గుండె జబ్బుల ప్రమాదం ఎక్కువగా ఉన్న నేపధ్యంలో, ప్రజలకు అందుబాటులో ఉండే ధరల్లో గుండె సంబంధిత పరీక్షలు అందించేందుకు మెడికవర్ హాస్పిటల్స్, కర్నూలు ప్రత్యేకంగా కార్డియాక్ వింటర్ ప్యాకేజ్ ను ప్రారంభించింది. ఈ కార్డియాక్ వింటర్ ప్యాకేజ్ ను కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రంత్ పటేల్ ఆవిష్కరించారు. అదే రోజు ఎస్పీ విక్రంత్ పటేల్ పుట్టిన రోజు అవ్వడంతో ఆయనకు ఫ్లవర్ బొకేహ్ ఇచ్చి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఎస్పీ విక్రంత్ పటేల్ గారు మాట్లాడుతూ, “మెడికవర్ హాస్పిటల్స్ కర్నూలు జిల్లా పోలీసు శాఖ కోసం ఆరోగ్య భద్రతద్వారా ఎంతో బాధ్యతతో, నిబద్ధతతో ఆరోగ్య సేవలను అందిస్తోంది. పోలీస్ సిబ్బందికి, వారి కుటుంబాలకు అత్యవసర సమయంలో అందించే వైద్య సేవలు విశేషంగా ఉన్నాయి” అని పేర్కొన్నారు. చలి కాలంలో హార్ట్ ఎటాక్స్ ప్రమాదం పెరుగుతుందని, ప్రతి ఒక్కరూ నిరంతర హార్ట్ చెకప్‌లు తప్పనిసరిగా చేయించుకోవాలని సూచించారు.మెడికవర్ హాస్పిటల్స్ క్లస్టర్ హెడ్ శ్రీ మహేశ్వర్ రెడ్డి గారు మాట్లాడుతూ, “సాధారణంగా రూ. 2800/- విలువ చేసే ఈ హార్ట్ ప్యాకేజ్‌ను, చలి కాల ప్రత్యేక ఆఫర్‌గా కేవలం ₹499/- కు అందిస్తున్నాము. ECG, 2D ఎకో, కార్డియాలజిస్ట్ కన్సల్టేషన్ వంటి సేవలు ఇందులో ఉన్నాయి. ఈ ప్యాకేజ్ ద్వారా ప్రజలు తమ గుండె ఆరోగ్యంపై ముందుగానే జాగ్రత్తలు తీసుకోవచ్చు” అని తెలిపారు. ఈ కార్యక్రమం లో మెడికవర్ హాస్పిటల్స్ కర్నూల్, మార్కెటింగ్ హెడ్ ఖాదర్ బాషా పాల్గొనడం జరిగింది.మెడికవర్ హాస్పిటల్స్ వైద్యుల బృందం చలి కాలంలో గుండె సమస్యలు పెరగవచ్చని, ముఖ్యంగా హార్ట్ అటాక్ రిస్క్ ఎక్కువగా ఉంటుందని ప్రజలకు అవగాహన కల్పించింది. ఈ ప్యాకేజ్ 2026 జనవరి 31 వరకు అందుబాటులో ఉంటుందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

