శ్రీరాముడి జీవనమే మానవాళికి ఆదర్శం
1 min read

డాక్టర్ మల్లు వేంకట రెడ్డి, తి.తి.దే.
ఘనంగా ముగిసిన తితిదే ధార్మిక కార్యక్రమాలు
కొలిమిగుండ్ల, న్యూస్ నేడు: శ్రీరాముడి జీవినమే సర్వమానవాళికీ ఆదర్శమని, ఆదర్శజీవనానికీ, అన్యోన్యతకు, శ్రీమద్రామాయణం ఆదర్శంగా నిలుస్తుందని, ఆదర్శవంతమైన జీవన విధానం నెలకొనాలంటే శ్రీరామాయణంలోని ప్రతి పాత్రనూ అద్యయనం చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లాశాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచారపరిషత్ ఆధ్వర్యంలో కొలిమిగుండ్ల మండలం, ఎర్రగుడి గ్రామంలో వెలసిన శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానం నందు గత ఐదు రోజులుగా జరుగున్న ధార్మిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా మూడు రోజులపాటు స్థానిక భజన మండలి చేసిన భజనలు, ధర్మప్రచారకులు నిత్యతృప్తదాస్ చేసిన ధార్మిక ప్రవచనాలు భక్తులను ఎంతగానో అలరించాయి. ముగింపు సందర్బంగా వేదపండితులు నంద్యాల నాగసాయి వరకుమార్ శర్మ ఆధ్వర్యంలో కృష్ణ యజుర్వేద పండితులు ఎన్. నాగసాయి శ్రవన్ కుమార్ శర్మ, ఎన్.నాగసాయి మణికంఠేశ్వర శర్మ, మహిళలందరితో గోపూజ మరియు కుంకుమార్చన కార్యక్రమాలు వేదోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయకమిటీ చైర్మన్ గుండం బాల సుబ్బారెడ్డి, ఎగ్గోని రామసుబ్బారెడ్డి, హార్మోనిష్ఠు కాతా గోపాల్ రెడ్డి, మోటాటి సుంకిరెడ్డి, లలితమ్మ, కాతా విజయలక్ష్మీ, దాసరి ఉమా, మద్దిలేటి, రమణారెడ్డితో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.


