ఉమ్మడి కర్నూలు.. నంద్యాల జిల్లాలలో 19577 కేసులు పరిష్కారం
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: జాతీయలోక్ అదాలత్ రాష్ట్ర న్యాయ సేవ అధికార సంస్థల ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ప్రధాన న్యాయమూర్తి అయిన జి. కబర్థి ఆధ్వర్యంలో శనివారం 13-12-2025 న జరిగిన జాతీయ లోక్ అదాలత్ లో ఉమ్మడి కర్నూలు నంద్యాల జిల్లాలలో 19577 కేసులు పరిష్కారం అయ్యాయి. 197 మోటార్ ఆక్సిడెంట్ కేసులలో 6,34,62,000/- బాధితులకు నష్టపరిహారంగా ఇన్సూరెన్స్ కంపెనీల నుండి ఇప్పించడం జరిగినది. జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ, కార్యదర్శి బి. లీలా వెంకట శేషాద్రి మాట్లాడుతూ మొత్తం రెండు జిల్లాల్లో 28 బెంచీలను ఏర్పాటు చేసి 284 సివిల్ కేసులు, 197 మోటార్ యాక్సిడెంట్ కేసులు, 19096 క్రిమినల్ కేసులను పరిష్కరించామని తెలిపారు. ఈ సమావేశంలో మొదటి అదనపు జిల్లా జడ్జి కమలాదేవి, ఆరవ అదనపు జిల్లా జడ్జి వాసు,ఏడవ అదనపు జిల్లా జడ్జి లక్ష్మి రాజ్యం, కర్నూలు బార్ ప్రసిడెంట్ హరినాథ్ చౌదరి, శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ వెంకట హరినాథ్, రిటైర్డ్ అదనపు జిల్లా జడ్జి లక్ష్మినరసింహారెడ్డి, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి మల్లేశ్వరి, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి సరోజనమ్మ మరియు జూనియర్ సివిల్ జడ్జి కిరణ్ కుమార్,జూనియర్ సివిల్ జడ్జి అనూష, కోర్టుమా నిటరింగ్ సి ఐ. రామానాయుడు, న్యాయ వాదులు, బ్యాంక్ అధికారులు, బి యస్ యన్ యల్ అధికారులు, పంచాయతీ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

