NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మెడికల్ హబ్ గా..కర్నూలు..

1 min read

బ్రెయిన్ అండ్ స్పైన్ సెంటర్ దినదినాభివృద్ధి చెందాలి

మాజీ ఎంపి టీజీ వెంకటేష్

కర్నూలు హాస్పిటల్ , న్యూస్ నేడు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కర్నూలు నగరం మెడికల్ సిటీగా మారబోతోందని మాజీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ అన్నారు. కర్నూలులో ఏర్పాటవుతున్న ఆసుపత్రులను చూస్తే ఎవరికైనా ఈ అభిప్రాయం కలుగుతుందని ఆయన అన్నారు. స్థానిక బుధవారపేటలో నూతనంగా నిర్మించిన బ్రెయిన్ అండ్ స్పైన్ సెంటర్ ను ఆయన  ప్రారంభించారు. ఈ సందర్బంగా టీజీ వెంకటేష్ మాట్లాడుతూ వైద్య సేవల రంగంలో కర్నూలు నగరం అగ్రగామిగా మారుతోందని అన్నారు. రాయలసీమతో పాటు, పొరుగున ఉన్న తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుండి నిత్యం వేలాది రోగులు చికిత్స కోసం కర్నూలుకు వస్తుంటారని , కర్నూలుకు వెళితే ఎంతటి జబ్బుకైనా చికిత్స లభిస్తుందనే అభిప్రాయం ప్రజల్లో ఉందని ఆయన అన్నారు. యువ వైద్యుల సారథ్యంలో ప్రారంభించిన బ్రెయిన్ అండ్ స్పైన్ సెంటర్ దినదినాభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు.  అనంతరం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డా. చంద్రశేఖర్ మాట్లాడుతూ దేశంలోని పెద్ద నగరాల్లో లభించే వైద్య సౌకర్యాలన్నీ కర్నూలులో లభిస్తున్నాయని అన్నారు. న్యూరాలజిస్టులు  డా. హేమంత్ కుమార్, డా. రాఘవేంద్ర మాట్లాడుతూ తమ ఆసుపత్రిలో రాయలసీమలో ఎక్కడా లేని అత్యాధునిక సౌకర్యాలు ఉన్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యూరాలజిస్ట్ డా. డబ్ల్యూ సీతారామ్ తదితరులు పాల్గొన్నారు.

About Author