NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పంచాయతీ కార్యదర్శులకు పదోన్నతులు..

1 min read

నందికొట్కూరు , న్యూస్ నేడు : నంద్యాల జిల్లానందికొట్కూరు మండలం కొణిదేల గ్రామ పంచాయతీ కార్యదర్శిగా ఎం రవీంద్రబాబు, జూపాడుబంగ్లా మండలం మండ్లెం గ్రామ పంచాయతీ కార్యదర్శిగా వై వీరారెడ్డి బాధ్యతలు చేపట్టారు.వీరు కర్నూలు జిల్లా క్రిష్ణగిరి మండలం అమకతాడు పీఎస్ గా రవీంద్రబాబు,ఎస్ హెచ్ ఎర్రగుడి పీఎస్ గా వీరారెడ్డి గ్రేడ్ 4 నుండి గ్రేడ్-3 పంచాయతీ కార్యదర్శులుగా పదోన్నతి పొంది ఇక్కడికి పదోన్నతిపై వచ్చారు. వీరిద్దరూ గతంలో మిడుతూరు మండలంలో పనిచేస్తూ క్రిష్ణగిరి మండలానికి బదిలీపై వెళ్లిన సంగతి తెలిసిందే.పదోన్నతి పొందిన సందర్భంగా క్రిష్ణగిరి మండల పరిషత్ కార్యాలయంలో వీరిని అధికారులు ఘనంగా సత్కరించారు.

About Author