NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జిల్లాను పర్యాటక హబ్ గా అభివృద్ధి చేయాలి

1 min read

పర్యాటక ప్రాంతాల ప్రాముఖ్యత  గురించి ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి

జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా

నంద్యాల, న్యూస్​ నేడు: జిల్లాలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయుటకు ఎన్నో అవకాశాలు ఉన్నాయని ఈ ప్రాంతాన్ని పర్యాటక హబ్ గా అభివృద్ధి  చేసేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లాలో వివిధ పర్యాటక ప్రదేశాల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా జిల్లా పర్యాటక అభివృద్ధి మండలి సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా మాట్లాడుతూ… పర్యాటక రంగ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందన్నారు. జిల్లాలో ఎక్కడా లేని విధంగా 24 పర్యాటక ప్రదేశాలు ఉన్నాయని వాటిని అభివృద్ధి చేయడం ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్నారు. జిల్లాలో చాలెంజ్ బేస్ డేస్టినేషన్ కింద అహోబిలంలో రూ.25 కోట్లతో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను త్వరగా పూర్తి చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు, గత సమావేశంలో చర్చించిన అంశాలు, వాటికి తీసుకున్న చర్యలు, ఇంకను చేపట్టాల్సిన పనులపై జిల్లా కలెక్టర్ సమీక్షించి అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కొల్లా బత్తుల కార్తీక్, జిల్లా టూరిజం అధికారి, డీఈవో జనార్దన్ రెడ్డి, తదితర అధికారులు పాల్గొన్నారు.

About Author