NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రాష్ట్ర అవార్డు అందుకున్న గౌసూల్ వరా

1 min read

విజయవాడ, న్యూస్​ నేడు:  రాష్ట్ర ప్రభుత్వం తరుపున 5 మంది ఐ ఏ ఎస్ అధికారుల చేతుల మీదుగా రాష్ట్ర అవార్డు అందుకున్న సీనియర్ జర్నలిస్ట్ ఈసా బాష కుమారుడు ఆదోని డివిజన్ వినియోగదారుల మండలి ఉపాధ్యక్షుడు గౌసూల్ వరాజాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర సివిల్ సప్లైస్ శాఖ ఎండి ఢిల్లీ రావు  ఐ ఏ ఎస్ ,రాష్ట్ర సివిల్  సప్లయిస్ డైరెక్టర్ గోవింద్ రావు ఐ ఏ ఎస్,  ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మిషా ఐఏఎస్, ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ ఈలఖ్య ఐ ఏ ఎస్ చేతుల మీదుగా  అవార్డు అందుకున్న ఆదోని డివిజన్ వినియోగదారుల రక్షణ మండలి ఉపాధ్యక్షులు,  గౌసూల్ వరా ,రాష్ట్రంలో  ప్రజా పంపిణీ వ్యవస్థను బలోపేతం చేసేందుకు వినియోగదారుల సంఘాలు ముందుంజలో ఉన్నాయని అధికారులు తెలిపారు. బియ్యపు అక్రమ రవాణా ను పూర్తి స్థాయిలో నిర్ములిస్తామని, వారిపై ఇకనుండి పి డి  యాక్టు క్రింద కేసులు నమోదు చేసేందుకు ప్రభుత్వం చట్టంలో మార్పులు చేసిందని అధికారులు తెలిపారు. డిజిటల్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డిజిటల్ మోసాలు జరగకుండా  వినియోగదారుల సంఘం ప్రజలకు అవగాహన కల్పించాలని రాష్ట్ర సివిల్ సప్లైస్  డైరెక్టర్ ఢిల్లీ రావు తెలిపారు. రాష్ట్ర అవార్డు రావడానికి సహకరించిన జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ ఐఏ ఎస్ , జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి రాజా రఘువీర్, జిల్లా వినియోగదారుల సమాచార కేంద్రం ఇంచార్జ్ నదీం హుస్సేన్జిల్లా వినియోగదారుల రక్షణ మండలి అధ్యక్షుడు  శివ మోహన్ రెడ్డి కు ఆదోని డివిజన్ వినియోగదారుల రక్షణ మండలి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది, గత రెండు దశాబ్దాలుగా మండలి వినియోగదారులకు సేవలు అందించిన ఫలమే ఈ రాష్ట్రస్థాయి అవార్డు కు నిదర్శనం.

About Author