ఈ క్రిస్మస్ పర్వదినం ప్రతి ఒక్కరి జీవితాల్లో నూతన వెలుగులు నింపాలి
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: నగరంలోని క్రైస్ట్ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చర్చి ప్రతినిధులు ఆయనకు స్వాగతం పలికారు .ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ తో పాటు బిషప్ సంతోష్ ప్రసన్న రావు, వైస్ ప్రెసిడెంట్ మేకల రాజేంద్ర బాబు, డినరీ చైర్మన్ థీయోడోరు, స్వరూప్ బాబు, బాదం భాస్కర్ బాబు, కార్యదర్శి ఇమ్మానియేల్ ,ట్రెజరర్ భాగ్యరాజు, జిల్లా విజిలెన్స్ అండ్ మానిటీరియల్ కమిటీ ఎస్సీ ఎస్టీ సభ్యులు గుడిపల్లి సురేందర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ ఈ క్రిస్మస్ పర్వదినం ప్రతి ఒక్కరి జీవితాల్లో నూతన వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. లోక కళ్యాణం కోసం క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ప్రభువును ప్రార్థిస్తారని ఆయన తెలిపారు. ఏసు క్రీస్తు పుట్టినరోజును క్రిస్మస్ పర్వదినంగా జరుపుకుంటారని, ఇది ఏసుక్రీస్తు శాంతి మార్గాన్ని చూపించిన రోజుగా ఆయన అభివర్ణించారు .ఏసుక్రీస్తు మనకోసం త్యాగాలు చేసి ప్రపంచానికి దశ దిశ నిర్దేశం చేశారని వివరించారు. పొరపాటున చేసిన పాపాలను క్షమించాలని ఏసుక్రీస్తును ప్రార్థిస్తారని వివరించారు. గతంలో రాజ్యాంగం అంటే భగవద్గీత, బైబిల్, ఖురాన్ అని వివరించారు. భగవద్గీత అయిన, బైబిల్ అయినా, ఖురాన్ అయినా అందరికీ మంచి చేయాలని మాత్రమే బోధిస్తాయని, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలన్నారు. ఏసుప్రభు చూపిన శాంతి మార్గాన్ని కోట్లాదిమంది ప్రజలు పాటిస్తున్నారని, ఇది మంచి పరిణామం వివరించారు. ఈ సందర్భంగా ప్రపంచంలోని అందరూ కలిసిమెలిసి జీవించాలని ఆయన ఆకాంక్షించారు. క్రిస్టియన్స్ స్మశాన వాటిక అభివృద్ధికి తన కుమారుడు, రాష్ట్ర మంత్రి టీజీ 50 లక్షల రూపాయలు మంజూరు చేశారని వివరించారు. తాను కూడా కర్నూల్ నగరం తో పాటు పరిసర గ్రామాలలో చర్చిల నిర్మాణంతో పాటు కమ్యూనిటీ హాల్ ల నిర్మాణాన్ని చేపట్టామని తెలియజేశారు. అలాగే ఈ చర్చికి గతంలో హార్స్ వెహికల్ అందజేసినట్లు ఆయన గుర్తు చేశారు. చర్చి అభివృద్ధికి పెద్దలు కోరితే తమ వంతు సహకారం నిరంతరం ఉంటుందని ఆయన వెల్లడించారు. క్రిస్టియన్ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ తెలియజేశారు.

