ఆహ్వానం మేరకు రేఖా నర్సింగ్ హోమ్ ని సందర్శించిన బుట్టా శివ నీలకంఠ
1 min read

ఎమ్మిగనూరు, న్యూస్ నేడు: ఎమ్మిగనూరు పట్టణంలోని పెద్ద పార్క్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన రేఖా నర్సింగ్ హోమ్ (ప్రైవేట్ ఆసుపత్రి) వారి ఆహ్వానం మేరకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూల్ పార్లమెంట్ సమన్వయకర్త, మాజీ ఎంపీ శ్రీమతి బుట్టా రేణుక భర్త బుట్టా శివ నీలకంఠ ఆసుపత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవలు, సౌకర్యాలు, చికిత్స విధానాలపై నిర్వాహకులతో వివరంగా చర్చించారు.ఎమ్మిగనూరు పట్టణానికి తోడు నియోజకవర్గ పరిధిలోని మారుమూల గ్రామాల నుంచి ఎక్కువగా నిరుపేద ప్రజలు వైద్య చికిత్సల కోసం పట్టణానికి వస్తుంటారని పేర్కొన్నారు.అటువంటి వారికి వెసులుబాటుగా, అందుబాటులో ఉండే విధంగా నాణ్యమైన వైద్య సేవలు అందించాలని ఆసుపత్రి యాజమాన్యాన్ని కోరారు.ప్రజలు డాక్టర్లను దైవాంశ సంభూతులుగా భావిస్తారని, వైద్య వృత్తి సేవాభావంతో కూడిన మహత్తర బాధ్యత అని తెలిపారు. పేదలకు మెరుగైన చికిత్సలు అందిస్తూ ప్రజల మన్ననలు పొందాలని, మానవతా దృక్పథంతో సేవ చేయాలని ఆకాంక్షించారు.రేఖా నర్సింగ్ హోమ్ ద్వారా ఎమ్మిగనూరు ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ మహత్తర కార్యక్రమంలో ఎమ్మిగనూరు పట్టణ మునిసిపల్ వైస్ చైర్మన్ డి. నజీర్ అహమ్మద్, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు కామర్తి నాగేశప్ప, బీసీ సెల్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ముగతి వీరుపాక్షి రెడ్డి, జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి యు.కె. రాజశేఖర్, జిల్లా ఎస్సీ సెల్ కార్యదర్శి కోరిశెట్టి మధుబాబు, బీసీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు దొరబాబు నాయుడు, మైనారిటీ సెల్ ఉపాధ్యక్షులు మహబూబ్ బేగ్, సోషల్ మీడియా జిల్లా ఉపాధ్యక్షులు షేక్ చాంద్, పట్టణ ప్రధాన కార్యదర్శి గడ్డం అంజి, పట్టణ కార్యదర్శి గురువ మాభాష, మాజీ కౌన్సిలర్ చేనేత మల్లి, 5వ వార్డు నాయకులు ఇబ్రహీం, పట్టణ బీసీ సెల్ ఉపాధ్యక్షులు బోయ మని, బీసీ సెల్ కార్యవర్గ సభ్యులు మంజునాథ్, 8వ వార్డు నాయకులు బండారి యల్లప్ప, బండారి హనూక్, బండారి చక్రవర్తి, ఎమ్మిగనూరు మండల కార్యదర్శి తిమ్మాపురం బజారి, నందవరం మండల బీసీ సెల్ అధ్యక్షులు బాపురం చిన్న రాముడు, సొగనూరు ఎంపీటీసీ మధుసూదన్ రెడ్డి, ప్రతాప్ గౌడ్, కడివేళ్ల కృష్ణ, కడివేళ్ల ఉరుకుందు గౌడ్, బనవాసి ఫారం రాజ్ కుమార్, మిట్ట సోమపురం సర్పంచ్ నరసింహులు, మాసుమన్ దొడ్డి శ్రీనివాసులు, తిరుపతయ్య, పోస్ట్ శ్రీను, కోటేకల్ గ్రామానికి చెందిన తయన్న, తిమ్మప్ప, వీరేష్, రాఘవేంద్ర, పాపన్న, దైవందీన్నే కె.వి. నాగరాజు, కె.వి. భరత్, బి. శీను, బి. శివ, పెద్ద మరివీడు మాజీ సర్పంచ్ దేవేంద్ర, రామాంజినేయులు, నాగేష్, రామకృష్ణ, నభి, తదితరులు పాల్గొని వేడుకలకు అపూర్వ వైభవం చేకూర్చారు.

