మాజీ ప్రధాని వాజ్ పేయి జయంతి వేడుకలు
1 min read

నందికొట్కూరు, న్యూస్ నేడు : మాజీ ప్రధానమంత్రి అటల్ బీహార్ వాజ్ పేయి నూరవ జయంతి వేడుకలను బిజెపి పట్టణ అధ్యక్షులు వడ్డే వేణుగోపాల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో బిజెపి పార్టీ కార్యాలయంలో గురువారం వేడుకలను నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బిజెపి రాష్ట్ర సీనియర్ లీడర్ చల్లా దామోదర్ రెడ్డి,గూడూరు రవి కుమార్ రెడ్డి హాజరయ్యారు.వారు మాట్లాడుతూ వాజ్ పేయి భారతదేశాన్ని దశా దిశలు మార్చిన గొప్ప నాయకుడు అలాగే అనుబాంబు అవసరమని ప్రపంచాన్ని ఎదిరించి అనుబాంబు ప్రయోగం చేసిన గొప్ప నాయకుడు ప్రతి గ్రామానికి రవాణా సౌకర్యం ఉండాలని గ్రామీణ సడక్ యోజన ద్వారా రోడ్డు సౌకర్యాలు ఏర్పాటు చేశాడు ఈరోజు మనం చూస్తున్న నేషనల్ హైవేస్ అన్ని అటల్ బిహారి వాజ్పేయి పుణ్యమే ఈరోజు మన చేతిలో ఉన్న సెల్ ఫోన్ ఇంత తక్కువ వ్యవధిలో అందరికీ అందుబాటులో తెచ్చిన ఘనుడు వాజ్పేయి అలా ప్రధాని నరేంద్ర మోడీ వాజ్పేయి యొక్క ఆదర్శాలను వునికి పుచ్చుకొని ప్రపంచంలోనే విశ్వ గురువుగా భారతదేశాన్ని తీర్చిదిద్దటంలో నిమగ్నమైన వ్యక్తి వికసిత్భారత్ లక్ష్యాన్ని అతివేగంగా అభివృద్ధి చేస్తున్న నాయకుడు ఈరోజు అమరావతిలో కూటమి ప్రభుత్వ నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబు,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్,బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ రాష్ట్ర మంత్రి సత్య కుమార్ సమక్షంలో శ్రీ వాజ్పేయి విగ్రహాన్ని అమరావతిలో ఘనంగా ఆవిష్కరించారని అన్నారు.ఈ కార్యక్రమంలో రామచంద్రుడు,శంకర్,పట్టణ ఉపాధ్యక్షులు భార్గవ రాముడు పోలిశెట్టి ఈశ్వర ప్రసాద్,పట్టణ ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రావు మహేష్ పాల్గొన్నారు.

